Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

పాత పాత్ర ఆ పెద్దాయన పాటకు సంగీత వాయిద్యం. పాటలో లీనమై ఆయన పాడుతున్న తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్‌కి నచ్చిన ఆ పాట.. ఆ పెద్దాయన ఎవరో చదవండి.

Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

Elderly man song viral

Updated On : May 31, 2023 / 1:40 PM IST

Elderly man song : సంగీతాన్ని వినడమే కాదు.. ఇష్టమైన పాటను మనకు ఇష్టమైన వాయిద్యంపై వాయిస్తూ పాడుకోవడం కూడా సంతోషాన్నిస్తుంది. ఓ పాత్రను సంగీత పరికరంగా వాయిస్తూ ఓ వృద్ధుడు పంజాబీ పాటను అద్భుతంగా పాడిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?

చాలామందిలో ప్రతిభ ఉంటుంది. కొందరు దానిని సరైన మార్గంలో పెట్టి పేరు తెచ్చుకుంటారు. కొందరి ప్రతిభ వారిలోనే ఉండిపోతుంది. ఓ పెద్దాయనకి పాటలు పాడటం హాబీ కావచ్చు. అందుకు ఆయన కంఠం.. ఇంట్లో ఉండే వస్తువులే వాయిద్య సంగీతాలు. ఓ పాత పాత్రని సంగీత పరికరంగా మలుచుకుని ‘జిదా దిల్ తుట్ ​​జాయే’ అనే అద్భుతమైన పంజాబీ పాటను పాడుకుంటూ సంతోషంలో మునిగి తేలుతున్నాడు.

 

ఈ పాటలో స్క్రీన్ మీద నూర్జహాన్ నటించారు. ఇక పెద్దాయన వీడియో చూసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్‌కి ముచ్చటేసింది కాబోలు.. ‘ఎంత అందమైన పాట. సరళమైనది ఇంకా సొగసైనది. మీరు పంజాబీని అర్థం చేసుకుంటే” అనే క్యాప్షన్‌తో Parveen Kaswan, IFS అనే తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

A tear-jerking story : మనవడి చికిత్స కోసం మేకప్ బ్యూటీ బ్లాగర్‌గా మారిన పెద్దాయన.. కన్నీరు తెప్పించే కథ

‘చక్కని స్వరం.. లయబద్ధంగా పెద్దాయన ఎంత బాగా పాడుతున్నారో’ అని ఒకరు.. ‘పాట సాహిత్యం, పాటలోని శ్రావ్యత.. అంతకు మించి ఆయన గానం అద్భుతం’ అని ఇంకొకరు వరుసుగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి పెద్దాయన పాట యూజర్లను కట్టిపడేసింది.