Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం యాక్షన్ మోడ్‌లోకి పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఇక ప్రస్తుతం పవన్...

Pawan Kalyan In Action Mode For Hari Hara Veera Mallu
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ను అందుకుంది. ఇక ప్రస్తుతం పవన్ వరుసబెట్టి సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్న పవన్, ఈ సినిమా షూటింగ్‌ను కొంతమేర పూర్తి చేశాడు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో పవన్ ఎలాంటి హిట్ కొడతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Hari Hara Veera Mallu: పవన్ రాక మరింత ఆలస్యం.. కారణం ఏంటంటే?
ఇక ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్న ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ ఇటీవల కసరత్తులు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను హిస్టారికల్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో పవన్ పాత్రపై ప్రేక్షకులతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను మొఘల్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో 17వ శతాబ్దానికి చెందిన కథగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.
Hari Hara Veera Mallu: హీరోయిన్ ఫిక్స్.. జాక్వెలిన్ స్థానంలో కెనడియన్ బ్యూటీ!
ఈ సినిమాలో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నటిస్తుండటంతో ఆయన పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.