రామ్‌చరణ్‌తో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్!

పండుగ వేళ మెగా అభిమానులకు ఆనందం కలిగించే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా మెగా, అల్లు ఫ్యామిలీ అంతా ఒకచోట చేరి వేడుక చేసుకోగా.. ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ రాలేదు. ఈ క్రమంలోనే బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లాడు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాడు.
రామ్ చరణ్‌కు బాబాయ్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉండగా.. సంక్రాంతి పండుగను సెలబ్రెట్ చేసుకున్న తర్వాత చెర్రి, బాబాయ్ ఇంటికి వెళ్లాడు. బాబాయ్‌తో కలిసి ఫొటో తీసుకోగా.. ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పండగ వేళ బాబాయ్‌తో చరణ్‌ను చూసి మెగా అభిమానులంతా హ్యాపీగా ఉన్నారు. మెగా కుటుంబ సంక్రాంతి వేడుకకు అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే.