కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం…మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 20, 2020 / 06:23 PM IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం…మోడీ

Updated On : October 20, 2020 / 7:22 PM IST

PM MODI ON CORONA VACCINE SUPPLY భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(అక్టోబర్-20,2020)జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి మోడీ ప్రస్తావించారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీకి సిద్దంగా ఉన్నట్లు మోడీ తెలిపారు. వ్యాక్సిన్ కోసం మనవాళ్లు కృషి చేస్తున్నారన్నారు. వ్యాక్సిన్ రాగానే పంపిణీ కోసం సర్వం సిద్ధం చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



మోడీ ప్రసంగంలోని హెలెట్స్
-కరోనా సమయంలో భారతీయులు ఎంతో సతమతమయ్యారని మోడీ అన్నారు.
-కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు
-కరోనా తర్వాత ఆర్థికవ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుందన్నారు.
-కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని అన్నారు.
-ఇళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామన్నారు.
-కేసులు తగ్గాయి కాబట్టి కరోనా పోయిందని భావించకూడదని మోడీ సూచించారు. మాస్కులు ధరించకపోతే కరోనా బారిన పడే ప్రమాదముందన్నారు.
-కరోనాపై పోరాటం సుదీర్ఘమైనదని మోడీ అన్నారు.



-భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందన్నారు.
-అమెరికా,బ్రెజిల్ లో కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉందన్నారు.
-లాక్ డౌన్ పోయింది..కరోనా వైరస్ పోలేదన్నారు.
-చాలా మంది కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.
-ఇది రిస్క్ తీసుకునే సమయం కాదు..మాస్క్ లు లేకుండా తిరగవద్దన్నారు.
-అప్రమత్తంగా ఉంటేనే కరోనాను జయించగలమన్నారు.



-ఈ పండుగ సీజన్ లో బజారుల్లో మళ్లీ కళ వస్తుందని..కానీ వైరస్ ఇంకా వెళ్లిపోలేదని గుర్తుంచుకోవాలన్నారు.
-పండుగ సీజన్ లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
-దేశ వ్యాప్తంగా 12వేల క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయన్నారు.
-90లక్షల బెడ్ లు కరోనా పేషెంట్ల కోసం ఏర్పాటు చేశామన్నారు.
-కరోనా పరీక్షల కోసం దేశంలో 2వేల ల్యాబ్ లు పనిచేస్తున్నాయన్నారు.
-పండిన పంటను చూసి మురిసిపోతాం..కానీ ఆ పంట ఇంటికి వచ్చే వరకు నిర్లిప్తత వద్దు.