Mumbai Heavy Rain : ముంబయిలో భారీవర్షాలు..భవనం కూలి శిథిలాల్లో ముగ్గురు చిక్కుకున్నారు

రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు....

Mumbai Heavy Rain : ముంబయిలో భారీవర్షాలు..భవనం కూలి శిథిలాల్లో ముగ్గురు చిక్కుకున్నారు

Building collapse

Updated On : June 25, 2023 / 12:18 PM IST

Mumbai Heavy Rain : రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు.(Building collapses in Mumbai)

Goods trains collide : బెంగాల్ రాష్ట్రంలో గూడ్స్ రైళ్ల ఢీ,12 బోగీలు పట్టాలు తప్పాయి..డ్రైవరుకు గాయాలు

అగ్నిమాపక దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ముంబై నగరంలో ఇప్పటివరకు 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఘట్కోపర్ ఉన్న తూర్పు శివారులో 123 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ శివారు ప్రాంతాల్లో 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.భారీవర్షాలతో ముంబయిలో రోడ్లపై వరదనీరు పారుతోంది.