Pranitha Subhash : ప్రణీత కూతుర్ని చూశారా?.. ఎంత క్యూట్ గా ఉందో..
నితిన్ రాజుతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ప్రణీత ఇటీవల పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకి ఆర్న అని పేరు పెట్టారు. తాజాగా మొదటిసారి ప్రణీత తన కూతురి...............

Pranitha Subhash : ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగులో పరిచయమైన ప్రణీత ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, బ్రహ్మోత్సవం, రామయ్యా వస్తావయ్యా.. లాంటి పలు సినిమాలతో మెప్పించింది. కన్నడలో కూడా చాల సినిమాలు చేసింది ప్రణీత. ఇలా సినిమాలతోనే కాకుండా కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి తన మంచితనాన్ని చాటుకుంది.
Chandoo Mondeti : నాగార్జునతో ‘విక్రమ్’లాంటి పవర్‌ఫుల్ సినిమా చేస్తాను..
ఇక కరోనా సమయంలోనే కన్నడ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజుని వివాహం చేసుకుంది. నితిన్ రాజుతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న ప్రణీత ఇటీవల పండంటి పాపకి జన్మనిచ్చింది. ఆ పాపకి ఆర్న అని పేరు పెట్టారు. తాజాగా మొదటిసారి ప్రణీత తన కూతురి ముఖం కనపడేలా ఫోటోలు పోస్ట్ చేసింది. కూతురు ఆర్నతో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రణీత. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.