President Ramnath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ..
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ జరగనున్నట్లుగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

President Ramnath Kovind Undergo To Bypass Surgery On Tuesday1
President Ramnath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మంగళవారం ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ జరగనున్నట్లుగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈనెల 26న ఆయనకు ఛాతిలో ఇబ్బంది తలెత్తడంతో హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆర్మీ వైద్యుల సూచన మేరకే రాష్ట్రపతిని శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చగా అక్కడ ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బైపాస్ సర్జరీ సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మంగళవారం ఉదయం ప్లాన్డ్ బైపాస్ ప్రోసెస్‌ను ఎయిమ్స్ వైద్యులు చేయనున్నట్లు రాష్ట్రపతి భవన్ కార్యాలయం తెలిపింది.
కాగా ప్రస్తుతం ఆదివారానికి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం స్థిరంగా ఉండగా ప్రస్తుతం ఆయన ఎయిమ్స్ నిపుణుల సంరక్షణలో ఉన్నారని ట్వీట్ చేసింది. కాగా, తన ఆరోగ్యంపట్ల ఆరా తీసి, కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికి రాష్ట్రపతి ధన్యవాదాలు చెప్పినట్లు ప్రెసిడెంట్ భవన్ మరో ట్వీట్ చేసింది. 75 ఏళ్ల వయసున్న కోవింద్ ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన వార్తతో నేతలు, కేంద్ర పెద్దల నుండి పరామర్శల వెల్లువ కొనసాగుతుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం కోవింద్‌ను ఆర్మీ ఆసుపత్రిలో ఉండగానే పరామర్శించగా.. అక్కడ నుండి రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి రాజ్‌నాథ్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రధాని మోడీ కూడా రాష్ట్రపతి కుమారుడితో మాట్లాడి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పీఎంఓ ట్వీట్ చేసింది.