PM Modi: ఈనెల 20న జిల్లా అధికారులతో ప్రధాని సమావేశం.. ఏం చెప్పనున్నారో?
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తికి తోడు టీకాలు, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించినా అటు ప్రభుత్వాలు కానీ.. ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

Prime Minister To Meet District Officials On 20th Of This Month
PM Modi: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా మారింది. వైరస్ వ్యాప్తికి తోడు టీకాలు, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరించినా అటు ప్రభుత్వాలు కానీ.. ప్రజలు కానీ పెద్దగా పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా బరస్ట్ అయిన సెకండ్ వేవ్ దేశాన్ని కమ్మేసి ప్రజల ఉసురుతీస్తుంది. ఇప్పటికే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అప్రమత్తమై కట్టడి చర్యలు తీసుకోగా కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్రాలకు సలహాలు సూచనలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షలు నిర్వహించారు.
కాగా, ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ త్వరలోనే దేశవ్యాప్తంగా జిల్లాల అధికారులతో సమావేశం కానున్నారు. కరోనాపై పోరులో జిల్లాస్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందుకే వైరస్ కట్టడికి జిల్లాల స్థాయి నుండే విధివిధానాల అమలు జరగాల్సిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 20న ప్రధాని మాట్లాడతారని పీఎంఓ తెలిపింది. దేశవ్యాప్తంగా పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను ప్రధాని జిల్లా అధికారులకు తెలపనున్నారు. వర్చువల్గా జరిగే ఈ భేటీలో వివిధ అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా అధికారులను మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.