Ram Charan: రీమేక్‌లపై చరణ్ కామెంట్.. ఫుల్ క్లారిటీతో ఉన్నాడుగా!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Ram Charan: రీమేక్‌లపై చరణ్ కామెంట్.. ఫుల్ క్లారిటీతో ఉన్నాడుగా!

Ram Charan Comments On Remake Movie

Updated On : November 29, 2022 / 9:31 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

Ram Charan: అఫీషియల్.. బుచ్చిబాబుతో చరణ్ మూవీ కన్ఫం!

ఇక తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టును ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అయినట్లు చరణ్ అఫీషియల్‌గా ప్రకటించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీమేక్ సినిమాలపై తనదైన శైలిలో కామెంట్ చేశాడు ఈ స్టార్ హీరో. తాను రీమేక్ సినిమాలకు వ్యతిరేకం కాదని.. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాని రీమేక్ కథలనే తాను చేస్తానని, అలాగే దర్శకనిర్మాతలు పలానా రీమేక్ చిత్రం తనతో వర్కవుట్ అవుతుందని భావిస్తేనే, తాను ఆ రీమేక్ సినిమాకు ఓకే చెబుతానని చరణ్ క్లారిటీ ఇచ్చాడు. గతంలో తాను చేసిన ‘ధృవ’ రీమేక్ చిత్రం అయినా, తెలుగు ఆడియెన్స్‌కు అది బాగా కనెక్ట్ అయ్యిందని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

Ram Charan : రామ్ చరణ్ సిగ్నేచర్ చూశారా??

ఇటీవల రీమేక్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకముందే, వాటి ఒరిజినల్ సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు ఓటీటీలోనే ఆ సినిమాలను చూస్తున్నారని, అందుకే ఓటీటీలో రిలీజ్ కాని రీమేక్ సినిమా అయితేనే తాను చేస్తానని దర్శకనిర్మాతలకు చరణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మరి చరణ్ రాబోయే కాలంలో ఏదైనా రీమేక్ సినిమా చేస్తే, అది ఎలా ఉంటుందో చూడాలి అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.