Ram Charan: అఫీషియల్.. బుచ్చిబాబుతో చరణ్ మూవీ కన్ఫం!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తాజాగా చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేం దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Ram Charan: అఫీషియల్.. బుచ్చిబాబుతో చరణ్ మూవీ కన్ఫం!

Ram Charan Buchi Babu Movie Confirmed Officially

Updated On : November 28, 2022 / 12:27 PM IST

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను శంకర్ తనదైన మార్క్ కంటెంట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. శంకర్ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని, అందుకే ఈ సినిమాతో చరణ్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, చరణ్ నెక్ట్స్ మూవీ గురించి గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

గతంలో చరణ్ తన కెరీర్‌లోని 16వ చిత్రాన్ని ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే, చరణ్‌కు గౌతమ్ చెప్పిన ఫైనల్ స్క్రిప్టు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టును పక్కనబెట్టాడు. దీంతో చరణ్ తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై అఫీషియల్‌గా ఓ క్లారిటీ వచ్చేసింది. చరణ్ తన నెక్ట్స్ చిత్రాన్ని ‘ఉప్పెన’ ఫేం దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల బుచ్చిబాబు, చరణ్‌ను కలిసి ఓ కథను వినిపించగా, చరణ్ ఈ సినిమాను ఓకే చేశాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను చిత్ర యూనిట్ వెల్లడించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు ఈ భారీ ప్రాజెక్టును ప్రొడ్యూస్ చేస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాకు కో-ప్రొడ్యూసర్‌గా వ్వవహరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఏదేమైనా చరణ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.