తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు.. 4 రోజుల్లో ఎంతో తెలుసా?

Liquor sales in Telangana : 2021 కొత్త ఏడాదిలో తెలంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే కోట్ల లిక్కర్ బిజినెస్ నడిచింది. దాదాపు రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది రాష్ట్రంలో కొత్త ఏడాది వేడుకలకు అనుమతి లేదు.
అయినప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగా కొనసాగాయి. గతేడాది పోలిస్తే.. ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం వచ్చినట్టు అబ్కారీ శాఖ పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.