RRR: ప్రభాస్ కోసం ట్రిపుల్ఆర్ స్పెషల్ షో..?
యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇప్పటికే అందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ....

Rrr Special Screening For Prabhas
RRR: యావత్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఇప్పటికే అందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ రచ్చ చేస్తున్నారు. కాగా సెలబ్రిటీలతో పాటు ఈ సినిమాను చూసేందుకు కామన్ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడుతున్నారు. పూర్తిగా పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూడనివారు వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని చూడాలని కోరుతున్నారు. ఇక చూసిన వారు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు.
RRR: ఆర్ఆర్ఆర్‌పై మహేష్ కామెంట్స్.. ఏమన్నాడంటే?
ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా చూసి తమ రెస్పాన్స్‌ను చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీని ఓ పాన్ ఇండియా స్టార్ కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్పెయిన్‌కు వెళ్లిన ప్రభాస్ ఈ వీకెండ్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నాడు. దీంతో ఆయన కోసం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని స్పెషల్‌గా స్క్రీనింగ్ వేయాలని దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు.
RRR: జక్కన్న కాకుంటే.. తారక్-చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదో?
సోమవారం నాడు ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుందని, ఈ బిగ్గెస్ట్ మూవీని చూశాక ప్రభాస్ తన రివ్యూని సోషల్ మీడియాలో పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న తెరకెక్కించిన ఈ పీరియాడిక్ ఫిక్షన్ కథ గురించి డార్లింగ్ ఎలా స్పందిస్తాడా అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమురం భీం పాత్రలో తారక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లకు జనం ఫిదా అవుతున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతోంది.