Tamil Nadu Ragging : కాలేజీలో బట్టలూడదీసి, కర్రలు, బెల్టులతో కొడుతూ ఎంజాయ్.. వామ్మో, ఇదేం ర్యాగింగ్‌రా నాయనా?

తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) దారుణం జరిగింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది.

Tamil Nadu Ragging : కాలేజీలో బట్టలూడదీసి, కర్రలు, బెల్టులతో కొడుతూ ఎంజాయ్.. వామ్మో, ఇదేం ర్యాగింగ్‌రా నాయనా?

Updated On : November 8, 2022 / 10:29 PM IST

Tamil Nadu Ragging : కాలేజీల్లో ర్యాగింగ్ పై నిషేధం ఉంది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడే వారిని కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. అయినా, సీనియర్ల తీరులో మార్పు లేదు. ఇంకా అనేక కాలేజీల్లో ర్యాగింగ్ కొనసాగుతూనే ఉంది.

అయితే, ఇది కాస్త లిమిట్ లో ఉంటే పర్లేదు. కానీ, శ్రుతి మించుతోంది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసే ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో(సీఎంసీ) దారుణం జరిగింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్లు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీనియర్లు.. జూనియర్ విద్యార్థుల బట్టలు విప్పించారు. చెడ్డీలపై క్యాట్ వ్యాక్ చేయించారు. అంతటితో ఊరుకోలేదు. పైపులతో నీళ్లు చల్లారు. కర్రలు, బెల్టులతో కొట్టారు. బురద గుంటలో జూనియర్లను పడుకోబెట్టారు. అంతేకాదు.. ఓ సీనియర్ కుర్రాడు.. జూనియర్ కుర్రాళ్ల ప్రైవేట్ పార్ట్ పై గట్టిగా కొట్టాడు కూడా. ఇలా రకరకాలుగా వారిని హింసించి ఎంజాయ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ర్యాగింగ్ పేరుతో సీనియర్ల వికృత చేష్టలపై దుమారం రేగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో కాలేజీ యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. ర్యాగింగ్ కు పాల్పడిన ఏడుగురు విద్యార్థులపై వేటు వేసింది.

వాళ్లసలు విద్యార్థులా? శాడిస్టులా? అనే అనుమానం కలుగుతోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఈ వీడియో చూసి వారు షాకయ్యారు. మరీ ఇంత దారుణంగా ర్యాగింగ్ చేస్తారా? అని విస్తుపోతున్నారు. ఇదసలు ర్యాగింగ్ కాదు, పైశాచికత్వం అని మండిపడుతున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన వారిని సస్పెండ్ చేస్తే సరిపోదు.. వాళ్లను జీవితాంతం జైల్లో వేయాలని డిమాండ్ చేస్తున్నారు.