YS Sharmila : కేసీఆర్ కు పాలన చేతకాదు .. బంగారు తెలంగాణ అని .. బార్ల తెలంగాణ చేశారు

బంగారు తెలంగాణ తెస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని బార్ల రాష్ట్రంగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు YS షర్మిల. కాంగ్రెస్ పార్టీ...బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయి అంటూ వ్యాఖ్యానించి ఆమె కేసీఆర్ కు పాలన చేతకాదని అన్నారు.

YS Sharmila : కేసీఆర్ కు పాలన చేతకాదు .. బంగారు తెలంగాణ అని .. బార్ల తెలంగాణ చేశారు

Sharmila's sensational comments on CM KCR

Updated On : August 22, 2022 / 3:43 PM IST

YS Sharmila : కేసీఆర్ కు పరిపాలన చేతకాదని..పరిపాలన అంటే ఏంటో కేసీఆర్ కు తెలియదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు పాలన అంటే ఏంటో చేతకాకే ప్రకటించిన ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. అంతేకాదు బంగారు తెలంగాణ తెస్తానని ప్రజలకు వాగ్ధానం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని బార్ల రాష్ట్రంగా మార్చారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ…బీజేపీ పార్టీలు కేసీఆర్ కు అమ్ముడుపోయాయి అంటూ వ్యాఖ్యలు చేశారు షర్మిల.

తెలంగాణాలో ఏ ఒక్క పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించటంలేదంటూ వ్యాఖ్యానించిన షర్మిల తాను ప్రజల పక్షాల నిలబడటానికే తెలంగాణలో పార్టీ పెట్టాను అంటూ చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తరచు విమర్శలు చేసే షర్మిల మరోసారి కేసీఆర్ పై ఇలా మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. కేసీఆర్‌వి ఓట్ల రాజకీయాలంటూ మండిపడ్డారు షర్మిల. వైఎస్సార్ ప్రతిపథకాన్ని అద్భుతంగా అమలు చేస్తే..సీఎం కేసీఆర్ వాటిని పక్కన పెట్టాడని వైఎస్ షర్మిల ఆరోపించారు.