Sudha murty comments : “నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు” సుధామూర్తి కామెంట్స్ వైరల్

ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. తన అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వడానికి తన కూతురు అక్షత కారణమంటున్నారు సుధామూర్తి. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sudha murty comments : “నా కూతురి వల్లే రిషి సునక్ ప్రధాని కాగలిగాడు” సుధామూర్తి కామెంట్స్ వైరల్

Sudha murty comments

Updated On : April 28, 2023 / 12:59 PM IST

Sudha murty comments :  ‘భార్య తలచుకుంటే భర్తను గొప్పవాడిగా తీర్చిదిద్దగలను.. నా అల్లుడు రిషి సునక్‌ను బ్రిటన్ ప్రధానిని చేయడం నా కూతురు అక్షత వల్లే సాధ్యమైంది’.. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపక చైర్మన్ నారాయణమూర్తి సతీమణి ..ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధా నారాయణమూర్తిగారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Sudha Murthy: మైసూరు రాజ మహిళ పాదాలకు నమస్కరించిన సుధా మూర్తి.. నెటిజన్ల విమర్శలు

నారాయణ మూర్తి గారు అత్యంత సంపన్నులలో ఒకరైన ఇన్ఫోసిస్ టెక్ కంపెనీ వ్యవస్థాపకులు. సుధామూర్తిగారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. సంపన్న కుటుంబంలో ఉన్నాసాదా సీదాగా ఉంటారు సుధామూర్తి.. కట్టు, బొట్టు, మాటతీరుతో చాలామందిని ఇన్ స్పైర్ చేస్తారు. ఇక ఈ దంపతుల ముద్దుల తనయ అక్షత 2009 లో రిషి సునక్‌ని వివాహమాడారు. అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సుధామూర్తి తన కూతురు, అల్లుడి గురించి ప్రస్తావిస్తూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అల్లుడు రిషి సునక్ అతి చిన్న వయసులో బ్రిటన్ ప్రధాని కాగలిగాడంటే అందుకు తన కుమార్తె ప్రోత్సాహమే కారణమన్నారామె. తాను తన భర్తను వ్యాపారవేత్తను మాత్రమే చేయగలిగానని చెప్పుకొచ్చారు. అక్షత తన కుటుంబాన్ని తన భర్తని ఎలా తీర్చిదిద్దుకుందో వివరించారు. ప్రస్తుతం సుధామూర్తి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సుధామూర్తి కాళ్లకు నమస్కరించిన అమితాబ్

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఏది సాధించాలన్నా ముందుగా ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా అవసరం. అక్షత సహాయ సహకారాలు .. ప్రోత్సాహం ఉండకపోతే రిషి సునక్ ప్రధాని పీఠం ఎక్కేవారా? అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ప్రతి మగవాడి విజయం వెను స్త్రీ ఉన్నట్లే రిషి సునక్ సక్సెస్ వెనుక ఖచ్చితంగా అక్షత ఉన్నారని చెప్పచ్చు.