పుట్టినరోజు నాడు రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసీఆర్

పుట్టినరోజు నాడు రుద్రాక్ష మొక్క నాటిన సీఎం కేసీఆర్

Updated On : February 17, 2021 / 4:14 PM IST

cm kcr planted rudraksha plant : తెలంగాణ CM శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌ంగా జరిగింది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభ తరుణాన తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు అంటే కేసీఆర్ అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా మారింది.

కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ విజ్ఞప్తి మేరకు కేసీఆర్ స్వయంగా “కోటి వృక్షార్చన”లో పాల్గొన్నారు. తన స్వహస్తాలతో ప్రగతి భవన్ లో రుద్రక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన “కోటి వృక్షార్చన” పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రోగ్రాం మరింత విస్తరించాలని సీఎం ఆకాంక్షించారు.

కాగా..సీఎం కేసీఆర్‌ మీద ఉన్న అభిమానంతో ఒక్క గంటలోనే కోటి మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతమైందని జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. “కోటి వృక్షార్చన” కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.