JC Prabhakar Reddy: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు.

JC Prabhakar Reddy: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

JC Prabhakar Reddy (Photo : Twitter)

Updated On : August 1, 2023 / 10:58 PM IST

Telangana HC: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు పంపింది. జేసీ ట్రావెల్స్ సంస్థలోని వాహనాలు BS-3 వి అని, అయితే వాటిని BS-4 గా చూపిస్తూ రవాణా సంస్థ నడుపుతున్నారన్న అభియోగాల నేపథ్యంలో కోర్టు ఈ నోటీసులు పంపింది. ఈ విషయమై తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే నెలలోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభాకర్‌రెడ్డికి పంపిన నోటీసుల్లో కోర్టు పేర్కొంది.

Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్‭ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?

దివాకర్ ట్రావెల్స్‌ బీఎస్-3 వాహనాలను కొని బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు గతంలో అధికారుల సోదాల్లో నిర్ధారణ అయింది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదు కావడంతో పలు వాహనాలు సీజ్‌ అయ్యాయి. తెలంగాణలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు చేయలేదని పిటీషనర్ పేర్కొన్నారు. 2020 అక్టోబర్‌ 12న రవాణశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశానని తెలిపిన పిటిషన్ దారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Adani Group: లాభాల పంట పండిస్తున్న అదానీ గ్రూప్ కంపెనీలు.. ఒకే దెబ్బకు రూ.71,000 కోట్ల లాభం

సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి తెలంగాణలో మాత్రం బస్సులను అక్రమంగా నడుపుతున్నారని పిటీషనర్ న్యాయవాదులు వాదించారు. అంతేకాకుండా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. ప్రతివాదులు తెలంగాణ రవాణశాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణశాఖ కమిషనర్‌, డీజీపీ, సీబీఐలతో పాటు జేసీ ప్రభాకర్‌ రెడ్డికి హైకోర్టు నోటీసులు పంపింది.