Triplets become doctors : తల్లీ ఆమెకు పుట్టిన ట్రిప్లెట్స్ డాక్టర్లే.. రేర్ డాక్టర్స్ ఫ్యామిలీ స్టోరీ

తల్లికి పుట్టిన బిడ్డలంతా ఒకటే ప్రొఫెషన్ ఎంచుకోవాలని లేదు. కానీ ఓ డాక్టర్‌కి పుట్టిన ట్రిప్లెట్స్ .. డాక్టర్లే అయ్యారు. అంతేకాదు.. ముగ్గురూ గైనకాలజిస్టులుగా పనిచేస్తున్నారు. రేర్ డాక్టర్ ఫ్యామిలీ స్టోరీ చదవండి.

Triplets become doctors : తల్లీ ఆమెకు పుట్టిన ట్రిప్లెట్స్ డాక్టర్లే.. రేర్ డాక్టర్స్ ఫ్యామిలీ స్టోరీ

Triplets become doctors

Updated On : May 17, 2023 / 12:25 PM IST

Triplets who are doctors like mother : ఇంట్లో తల్లిదండ్రుల వృత్తిని బిడ్డలు ఒకరో ఇద్దరు ఇష్టపడి సేమ్ ప్రొఫెషన్ లోకి వెళ్లడం వినే ఉంటాం. కానీ ఓ డాక్టర్ తల్లికి పుట్టిన ట్రిప్లెట్స్ .. ముగ్గు పిల్లలు డాక్టర్లే. ఆసక్తికరంగా ఉంది కదా..

heart-touching story : నాల్గవ లడ్డూ నేను ఎప్పటికీ తీసుకోలేను.. డాక్టర్ షేర్ చేసిన పోస్ట్.. నాల్గవ లడ్డూ ఏంటి?

పిల్లలు పేరెంట్స్ అడుగుజాడల్లో నడుస్తారు. చిన్నప్పటి నుంచి వారినే అనుసరిస్తూ ఆఖరికి అదే ప్రొఫెషన్ లో సెటిల్ అవుతుంటారు. జోవన్నా, విక్కీ, సారా బెడెల్ ఈ ముగ్గురు తల్లి డాక్టర్ జానెట్ గెర్స్టన్ పుట్టిన ట్రిప్లెట్స్.. తల్లి అడుగుజాడల్లో నడిచారు. తల్లిలాగే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఇలా ట్రిప్లెట్స్‌గా పుట్టడమే కాకుండా తల్లివలే ఒకే వృత్తిని ఎంచుకునేవారు అరుదుగా ఉంటారు.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో @todayshow పేజీ చేసిన పోస్ట్ ప్రకారం జోవన్నా, విక్కీ, సారా బెడెల్ తల్లిలాగనే గైనకాలజిస్టులు కావడం కూడా విశేషం. అయితే తన బిడ్డలకి ఎప్పుడూ తనని ఫాలో అవ్వమని చెప్పలేదని.. అయినా ముగ్గురు ఒకే వృత్తిని ఎంచుకోవడం గర్వంగా అనిపిస్తోందని వీరి తల్లి జానెట్ గెర్ట్సన్ చెప్పారు. ఇక వీరి కథనం చదివి చాలామంది స్పందించారు.

Cow Dung coating car : డాక్టర్ గారి ఐడియా.. చల్లదనం కోసం కారుకి పేడ పూత

‘వారు నా మేనకోడళ్లకు డెలివరీ చేశారు.. అద్భుతమైన వైద్యులు’ అని ఒకరు.. ‘ఇది నమ్మశక్యం కాని అద్భుతమైన కథ’ అన్నాడు మరొకరు అని వరుసగా కామెంట్లు పెట్టారు. మొత్తానికి ఈ డాక్టర్ ఫ్యామిలీ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.

 

View this post on Instagram

 

A post shared by TODAY (@todayshow)