Today Headlines : గిద్దలూరు లేదా చీరాల నుంచి పోటీ చేస్తా- ఆమంచి స్వాములు

జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు. 

Today Headlines : గిద్దలూరు లేదా చీరాల నుంచి పోటీ చేస్తా- ఆమంచి స్వాములు

Updated On : January 14, 2024 / 10:17 PM IST

గిద్దలూరు లేదా చీరాల నుంచి పోటీ చేస్తా..
రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు అన్నారు. వ్యవస్థలన్నింటిని అవినీతిమయం చేసిన ఘనత సీఎం జగన్ ది అని ధ్వజమెత్తారు. వేంకటేశ్వర స్వామి హుండీని దోచుకున్న ఘనుడు వైఎస్ జగన్ అని ఆరోపించారు. నాకు అవకాశం ఇస్తే గిద్దలూరు లేదా చీరాల నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అని ఆయన చెప్పారు. దీనిపై జనసేన అధినాయకుడి నిర్ణయమే నాకు శిరోధార్యం అన్నారాయన.

బందరులో భారీ బహిరంగ సభ?
వైసీపీకి రాజీనామా చేసిన మచిలీపట్నం కీలక నేత వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ నెల 18న లేదా 21వ తేదీన బందరులోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించి ఆ సమయంలోనే ఆయన సమక్షంలో జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేన తరఫున మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని బాలశౌరి భావిస్తున్నారు.

సంక్రాంతి తర్వాత వైసీపీ ఫైనల్ లిస్ట్?
సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ నెల 17న లేదా 18న నాలుగో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ నాలుగో జాబితాను రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు..
తిరుపతి జిల్లా నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేఖ జీవో పత్రాలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ సంబరాల్లో బాలకృష్ణ సతీమణి వసుందర, చిన్న కుమార్తె, లోకేశ్ కుమారుడు దేవాన్ష్, పలువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మాల్దీవుల అధ్యక్షుడికి బిగ్ షాక్..
అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు ఎదురు దెబ్బ తగిలింది. రాజధాని మాలె మేయర్ ఎన్నికల్లో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది.

వైసీపీ మునిగిపోయే నావ..
నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తానని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ అన్నారు. నా అవసరం ఎక్కడఉందో పార్టీకి తెలుసన్నారు. వైసీపీ మునిగిపోయే నావ. నమ్ముకున్న నేతలకు కూడా జగన్ న్యాయం చేయ్యలేదు. ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్ ఇవ్వడం లేదని గంటా శ్రీనివాస్ అన్నారు.

వైసీపీతో మా ఫ్యామిలీ..
ఒంగోలులో రాజకీయ పరిస్థితులు త్వరలోనే సమసిపోతాయని బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి అన్నారు. నాన్నతో వైసీపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. మా ఫ్యామిలీ వైసీపీతోనే ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే బాలినేని పోటీచేస్తారని ప్రణీత్ రెడ్డి పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదం ..
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను వాహనం ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు మునిరాజా, రాంకీ, గౌతమ్ గా గుర్తించారు. దొరహరిసత్రం మండలం కలగుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది.

తనిఖీలు..
విశాఖ జిల్లాలోని అగనంపూడి టోల్ గేటు వద్ద రవాణాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని 20 బస్సులకు జరిమానా విధించారు.

భోగి వేడుకల్లో పురంధేశ్వరి..
బాపట్ల జిల్లా కారంచేడులో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి వేడుకల్లో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కూడా పాల్గొన్నారు.

భారత్ జోడో న్యాయ యాత్ర ..
‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ మణిపుర్ లోని ధౌబల్ జిల్లాలోని శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల ఆ రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లలో 180 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో యాత్రను అక్కడి నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ యాత్ర మార్చి 20 లేదా 21న ముంబయిలో ముగియనుంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 377 అసెంబ్లీ స్థానాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది.

యుద్ధానికి 100 రోజులు..
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వీరి మధ్య భీకర పోరుకు 100 రోజులు పూర్తయింది. ఇరువర్గాల మధ్య యుద్ధంలో 23వేలకుపైగా మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత ఈ దేశానికి, పాలస్తీనాయులకు మధ్య సాగుతున్న సుదీర్ఘ ఘర్షణ ఇదే.