Today Headlines: ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.

Today Headlines: ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

11PM Headlines

సీఎం రేవంత్ రెడ్డికి బాలకృష్ణ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీకి చెందిన నాయకులు కూడా ఆ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు.

”ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా రేవంత్ రెడ్డి ఎదిగారు. తెలంగాణ ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆకాంక్షలను నేరవేర్చాలి. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యమంత్రిగా మీ మార్కు పాలనతో తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా” అని ఓ ప్రకటనలో తెలిపారు బాలకృష్ణ.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే.. తేల్చి చెప్పిన కాంగ్రెస్
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ రెండు రోజులుగా సాగుతున్న హైడ్రామాకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి తెలంగాణలోని కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం చాలా పెద్ద పోటీయే నడిచింది. భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు చర్చలో ప్రధానంగా వినిపించారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేవంత్ రెడ్డివైపే మొగ్గు చూపింది.

రాజస్థాన్ లో కాల్పులు..
రాజస్థాన్ లో రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ సుఖ్ దేవ్ సింగ్ ను కాల్చివేశారు. జయపురాలో బైక్ పై వచ్చిన దుండగులు సుఖ్ దేశ్ ను కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఇద్దరికి గాయాలయ్యాయి.

నేతలకు బాబు ఆదేశం
మిగ్ జామ్ తుపానుపై టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.ప్రభుత్వం సహాయం చేసేవరకు ఎదురు చూడకుండా సహాయం చేయాలని సూచించారు. తాగునీరు, ఆహారం అందేలా చూడాలని చెప్పారు. బాధితులకు సహాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆదేశించారు.

తీరంలో అలజడి
మిగ్‌జామ్‌ తుఫాన్ బాపట్లకు సమీపంలో తీరాన్ని దాటింది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై కనిపిస్తోంది. తీర ప్రాంతంలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. తుపాను ప్రభావానికి వేలాది ఎకరాల్లో పంటల నీటమునిగాయి. అకాల వర్షాలతో రైతలు తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలతో తిరుమలలో డ్యామ్‌లు నిండు కుండల్లా మారాయి.

తుఫాన్‌ ప్రభావం
మీచాంగ్ తుఫాన్ ప్రభావం వల్ల విజయవాడలో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొండ చర్యలు ఇరిగిపడతాయని దుర్గగుడి అధికారులు ముందుగానే ఘాట్ రోడ్డు ముసి వేశారు. దుర్గగుడికి కార్లకు, ద్విచక్ర వాహనాలు పై వచ్చే భక్తులకు అనుమతి లేదని దుర్గగుడి అధికారులు తెలిపారు. దుర్గ గుడికి వచ్చే భక్తులు మెట్ల మార్గం, లిఫ్ట్ మార్గం ద్వారా దుర్గగుడికి రావాలని ఆలయ అధికారులు సూచించారు.

బాధితులకు సీఎం భరోసా
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారికి నీరు, ఆహారం వంటివి అందించారు. తుఫాను బాధిత ప్రజలకు ఆయన సహాయ సామగ్రిని కూడా పంపిణీ చేశారు.

ఫుల్‌ మెజారిటీ
మిజోరాం సీఎంగా లాల్దుహోమా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు.. ఎన్డీఏ, ఇండియా కూటమికి తాము సమదూరమని అన్నారు.

డీకేతో ముగిసిన ఉత్తమ్ భేటీ..
ఢిల్లీలో డీకే శివకుమార్ తో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అన్నారు. ఎమ్మెల్యేలమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసి హైకమాండ్ పంపించామని, ఎవరు సీఎం అవుతారనే విషయం నేను చెప్పలేనని ఉత్తమ్ అన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ.. సీఎం ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.

ఢిల్లీకి చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఓట్ల అక్రమాలపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు.

చంద్రబాబుకు రిలీఫ్ ..
చంద్రబాబుపై దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడలోని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో విచారించాలని సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్ పై ఉన్నందున వారెంట్లు నిరర్దకమవుతాయంటూ వాటిని తోసిపుచ్చింది.

చెన్నైలో మిమానాల రాకపోకలు పునరుద్దరణ..
మిగ్‌జామ్‌ తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావం నుంచి కాస్త తేరుకుంటోంది. మంగళవారం తెల్లవారు జాము నుంచి చాలాచోట్ల వర్షం లేకపోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం నుంచి వర్షం లేకపోవటంతో రన్ వేపై నీటిని అధికారులు తొలగించారు. దీంతో మంగళవారం ఉదయం ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలను పునరుద్దరించారు.

విమానాలు రద్దు..
మిచాంగ్ తుఫాను కారణంగా విశాఖ నుంచి 23 ఇండిగో విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ పోర్టు డైరెక్టర్ పేర్కొన్నారు. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24గంటలు పనిచేస్తుందని అన్నారు.

స్తంభించిన రవాణా
మిచాంగ్ తుపాను కారణంగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో చెన్నైలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి.

గాజా..గజ గజ
గాజాలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేసింది. సోమవారం అటు వైమానిక, ఇటు భూతల దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్ యూనిస్ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చించింది. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాల కోసం పరుగులు పెడుతున్నారు. గాజాలోని 500 హమాస్‌ టన్నెల్స్‌ ధ్వంసం ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది.

ఇస్రో సత్తా ..
ఇస్రో అరుదైన ఘనత సాధించింది. భూ కక్ష్యకు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ తరలించింది.

మిజోరంలో JPM విజయం ..
మిజోరం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. జోరాం పీపుల్స్ మూవ్ మెంట్(JPM) పార్టీ విజయం సాధించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం అధికారంలోఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎస్ఎఫ్) పార్టీ కేవలం 10 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఓటమి పాలైన ముఖ్యమంత్రి జోరామ్ తాంగ గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు.