Trivikram: పవన్ కళ్యాణ్‌కు నో చెబుతున్న త్రివిక్రమ్..?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరి పేర్లు ఒక సినిమాలో కనిపించాయంటే ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్‌తో సినిమా....

Trivikram Says No To Pawan Kalyan Movie
Trivikram: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరి పేర్లు ఒక సినిమాలో కనిపించాయంటే ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో మనందరికీ తెలుసు. అయితే పవన్ కళ్యాణ్‌తో సినిమా కోసం పనిచేస్తూ ఆయనకు స్నేహితుడిగా.. కాదు.. అంతకు మించిన వ్యక్తిగా మారిపోయాడు దర్శకుడు త్రివిక్రమ్. ఇక ఆ తరువాత వారిద్దరి మధ్య బంధం ఎలా ముందుకు సాగుతుందో అభిమానులతో పాటు ప్రేక్షకులందరికీ తెలిసిందే. క్లోజ్ ఫ్రెండ్స్ కంటే కూడా ఎక్కువగా పవన్, త్రివిక్రమ్ ఒకరితో మరొకరు కలిసిపోయారు. అయితే పవన్ సినిమాలకు సంబంధించి అన్నీ దగ్గరుండి చూసుకునే త్రివిక్రమ్, ఇప్పుడు పవన్ సినిమాకు పనిచేయడానికి నో చెప్పాడు. అవును.. ఇది నిజం!
Trivikram : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ ఎందుకు మాట్లాడలేదు?
ఇటీవల ‘భీమ్లా నాయక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం ఆ సినిమాకు స్క్రిప్టు పనితో పాటు మాటలు రాయడం లాంటి బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు త్రివిక్రమ్. ఇక ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన త్రివిక్రమ్, సినిమా లాభాల్లోనూ తనవంతుగా భారీ మొత్తాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు పవన్ ‘వినోదయ సీతం’ అనే మరో రీమేక్ చేసేందుకు ఆసక్తిగా ఉండగా, ఈ సినిమా కోసం కూడా త్రివిక్రమ్‌కు స్క్రిప్టు పనులను అప్పగించాలని అనుకున్నాడు. కానీ.. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేసిన త్రివిక్రమ్, మరో సినిమా కోసం వర్క్ చేయడం ఇష్టం లేదని తేల్చి చెప్పాడట. తాను ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడని, ఈ సినిమా కోసమే పవన్ సినిమాను వదులుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక పవన్ చేయాలనుకుంటున్న రీమేక్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఈసారి వేరొక రైటర్‌కు అప్పగించాలని ఆయన కోరాడట.
Pawan Kalyan: హరిహర వీరమల్లు.. మరోసారి వాయిదా?
అంతేగాక మరో స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ పేరును కూడా ఆయన రిఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా పవన్ సినిమాకు త్రివిక్రమ్ నో చెప్పాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అసలు విషయం తెలుసుకుని పవన్ అండ్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ అంతేనా అనుకుంటున్నారు. ఏదేమైనా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మళ్లీ త్వరలో కలిసి పనిచేయాలని వారు కోరుతున్నారు.