Budget-2021 Live: నేడే కేంద్ర బడ్జెట్.. ఆశగా ఎదురుచూస్తున్న దేశం!

Budget-2021 Live: నేడే కేంద్ర బడ్జెట్..
[svt-event title=”ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పొడిగింపు” date=”01/02/2021,1:04PM” class=”svt-cd-green” ] ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 31 మార్చి 2022 వరకు గృహాల కొనుగోలుపై రాయితీలు పొందవచ్చని వెల్లడించారు. [/svt-event]
[svt-event title=”సీనియర్ సిటిజన్లకు ఊరట” date=”01/02/2021,1:03PM” class=”svt-cd-green” ] సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చే వార్త వినిపించింది కేంద్రం. 75 ఏళ్లు పైబడిన వారికి ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చింది. ఫించను, వడ్డీ ఆదాయం ఆధారంగా..ఐటీ మినహాయింపునిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
https://10tv.in/big-relief-for-senior-citizens-in-union-budget-2021/
[/svt-event]
[svt-event title=”ఆదాయపు పన్ను చెల్లింపులు యథాతథం” date=”01/02/2021,1:01PM” class=”svt-cd-green” ] తాజా బడ్జెట్ లో ఆదాయపు పన్నుపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. దీంతో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు నిరాశే ఎదురైంది. గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాబులు కొనసాగనున్నాయి. [/svt-event]
[svt-event title=”నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ – నిర్మలా” date=”01/02/2021,12:41PM” class=”svt-cd-green” ] 15 వేల పాఠశాలలు శక్తివంతంగా తయారు చేస్తామని ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు, రూ. 40 కోట్లు కేటాయింపులు చేయడం జరిగిందన్నారు. ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు లెహ్, లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. [/svt-event]
[svt-event title=”ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ” date=”01/02/2021,12:25PM” class=”svt-cd-green” ] ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. ఐడీబీఐ, భారత్ ఎర్త్ మూవర్స్ పెట్టుబడులలో ఉపసంహరణకు ఒకే చెప్పింది. పార్లమెంట్ లో బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ చేయబోతున్నట్లు, ఇందుకు చట్టసవరణ చేస్తామన్నారు. 2021-22లో పవన్ హన్స్, ఎయిరిండియా ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు వెల్లడించారామె.
https://10tv.in/massive-withdrawal-of-investment-in-public-sector-undertakings/
[/svt-event]
[svt-event title=”గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లోకి మరో వంద నగరాలు” date=”01/02/2021,12:23PM” class=”svt-cd-green” ] మూడు సంవత్సరాల్లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ లోకి మరో వంద నగరాలను చేరుస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పవర్ సెక్టార్ కోసం రూ. 3.05 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2021-22 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. [/svt-event]
[svt-event title=”మెట్రో రైలు ఫేజ్ -2 కు నిధులు” date=”01/02/2021,12:22PM” class=”svt-cd-green” ] కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ – 2 కోసం రూ. 1,957 కోట్లు కేటాయిస్తున్నట్లు, చెన్నై మెట్రో రైలు ఫేజ్ -2 కు రూ. 5 వేల 300 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అలాగే…బెంగళూరు మెట్రో రైల్ ఫేజ్ -2 కోసం రూ. 14 వేల 788 కోట్లు, నాగ పూర్ మెట్రో రైల్ ఫేజ్ – 2 కోసం రూ. 5 వేల 976 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పీపీపీ మోడళ్లలో మేజర్ పోర్టులో అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. [/svt-event]
[svt-event title=”కొచ్చి, చెన్నై మెట్రో రైలు ఫేజ్ కు నిధులు” date=”01/02/2021,11:49AM” class=”svt-cd-green” ] కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ – 2 కోసం రూ. 1,957 కోట్లు కేటాయిస్తున్నట్లు, చెన్నై మెట్రో రైలు ఫేజ్ -2 కు రూ. 5 వేల 300 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. [/svt-event]
[svt-event title=”రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు ” date=”01/02/2021,11:46AM” class=”svt-cd-green” ] రైల్వేలకు రూ. 1.10 లక్షల కోట్లు కేటాయించింది కేంద్రం. పార్లమెంట్ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 1,957 కోట్లతో కొచ్చి మెట్రో రైల్ ఫేజ్ -2 రూపొందించనున్నట్లు ప్రకటించారు. [/svt-event]
[svt-event title=”నేషనల్ రైల్వే ప్లాన్ తయారు చేసిన భారతీయ రైల్వే” date=”01/02/2021,11:44AM” class=”svt-cd-green” ] నేషనల్ రైల్వే ప్లాన్ భారతీయ రైల్వే తయారు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021-22 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. రైల్వేల ద్వారా సరుకు రవాణాకు ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపారు. [/svt-event]
[svt-event title=”తమిళనాడులో కొత్తగా 3 వేల 500 కి.మీటర్ల రోడ్లు అభివృద్ధి – నిర్మలా” date=”01/02/2021,11:42AM” class=”svt-cd-green” ] కొద్ది రోజుల్లో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ సందర్భంగా ఈ రాష్ట్రంపై కేంద్రం వరాలు కురిపించింది. తమిళనాడులో కొత్తగా 3 వేల 500 కి.మీటర్ల రోడ్లు అభివృద్ధి చే్సతామని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. భారత మాలా ప్రాజెక్టు కింద 3 వేల 800 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. [/svt-event]
[svt-event title=”ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ పై వరాల జల్లు” date=”01/02/2021,11:40AM” class=”svt-cd-green” ] ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు, బెంగాల్ పై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మంత్రి నిర్మలా. తమిళనాడు, బెంగాళ్, కేరళ, అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక కారిడార్లు ప్రకటించారు మంత్రి నిర్మలా. [/svt-event]
[svt-event title=”11 వేల కి.మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేస్తాం ” date=”01/02/2021,11:38AM” class=”svt-cd-green” ] 11 వేల కి.మీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడదించారు. రూ. 6 వేల 500 కోట్లతో కేరళలో కొత్తగా రోడ్లు నిర్మాణం చేపడుతామన్నారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మంత్రి నిర్మలా. [/svt-event]
[svt-event title=”మరిన్ని ఎకనామిక్ కారిడార్లు – నిర్మలా” date=”01/02/2021,11:36AM” class=”svt-cd-green” ] మౌలిక సదుపాయాల వృద్ధికి మరిన్ని ఎకనామిక్ కారిడార్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మూడేళ్లలో ఏడు టెక్స్ టైల్ పార్కులు ఏర్పాటు చేస్తామని పార్లమెంట్ లో వెల్లడించారు. 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు మంత్రి నిర్మలా. [/svt-event]
[svt-event title=”లక్ష కోట్ల విలువైన 217 మౌలిక ప్రాజెక్టులు పూర్తి” date=”01/02/2021,11:33AM” class=”svt-cd-green” ] లక్ష కోట్ల విలువైన 217 మౌలిక ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగిందని పార్లమెంట్ లో ప్రకటించారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..జల్ జీవన్ మిషన్ కోసం రూ. 2.87 లక్షల కోట్లు కేటాయించామన్నారు. [/svt-event]
[svt-event title=”20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కోసం న్యూ స్ర్కాపేజ్ పాలసీ” date=”01/02/2021,11:32AM” class=”svt-cd-green” ] 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కోసం న్యూ స్క్రాపేజ్ పాలసీ, 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు కొత్త స్క్రాప్ పాలసీ తీసుకొస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మెగా ఇన్వెస్ట్ మెంట్ టెక్స్ టైల్స్ పార్క్ ఏర్పాటు, మూడేళ్లలో 7 పార్కులను ఏర్పాటు చేస్తామన్నారు.
https://10tv.in/fm-nirmala-sitharaman-announces-vehicle-scrappage-policy/
[/svt-event]
[svt-event title=”కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 35 వేల కోట్లు” date=”01/02/2021,11:31AM” class=”svt-cd-green” ] కోవిడ్ వ్యాక్సిన్ల కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. డెవలప్ మెంట్ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూటషన్ కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.
https://10tv.in/35-thousand-crores-for-corona-vaccine-in-union-budget-2021/
[/svt-event]
[svt-event title=”వైద్య ఆరోగ్య రంగానికి రూ. 2.23 లక్షల కోట్లు – నిర్మలా” date=”01/02/2021,11:28AM” class=”svt-cd-green” ] వైద్య ఆరోగ్య రంగానికి రూ. 2.23 లక్షల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత సంవత్సరం కంటే..137 శాతం అధిక కేటాయింపులు చేశామని చెప్పారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. [/svt-event]
[svt-event title=”రూ. 64, 180 కోట్లతో స్వస్థ భారత్ యోజన” date=”01/02/2021,11:28AM” class=”svt-cd-green” ] రూ. 64, 180 కోట్లతో స్వస్థ భారత్ యోజన తీసుకొస్తున్నట్లు, వాయు కాలుష్యం నివారణ కోసం 42 సెంటర్లకు రూ. 2 వేల 217 కోట్లు కేటాయించామన్నారు మంత్రి నిర్మలా సీతారామన్. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. [/svt-event]
[svt-event title=”పేదలకు ఎంతో మేలు చేశాం” date=”01/02/2021,11:22AM” class=”svt-cd-green” ] ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా..పేదలకు ఎంతో మేలు చేశామని, 130 కోట్ల మంది భారతీయులకు ఆత్మనిర్భర్ భారత్ ద్వారా..అండగా ఉన్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ మనకు కొత్తదేం కాదన్నారు. మనమూలాల్లోనే..ఆత్మనిర్భర్ ఉందన్నారు. [/svt-event]
[svt-event title=”రైతుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు – నిర్మలా” date=”01/02/2021,11:20AM” class=”svt-cd-green” ] రైతుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే..వైద్య ఆరోగ్య రంగానికి ఈసారి భారీగా కేటాయింపులు చేశామన్నారు మంత్రి నిర్మలా. [/svt-event]
[svt-event title=”అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్” date=”01/02/2021,11:18AM” class=”svt-cd-green” ] అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ రూపొందించామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఆత్మనిర్భర్ భారత్ పై ప్రత్యేక దృష్టి ఉందని, 8 నెలల పాటు పేదలకు రేషన్ అందించామన్నారు. [/svt-event]
[svt-event title=”ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్ డౌన్ నష్టాలు తగ్గించాయి. ” date=”01/02/2021,11:16AM” class=”svt-cd-green” ] ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్ డౌన్ నష్టాలు తగ్గించాయని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. [/svt-event]
[svt-event title=”టీమ్ ఇండియా మాదిరిగానే..ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. ” date=”01/02/2021,11:14AM” class=”svt-cd-green” ] టీమ్ ఇండియా మాదిరిగానే..ఇండియా ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరోనా తర్వాత ప్రపంచం మారుతోందన్నారు. కరోనా పోరుకు మరిన్ని వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. [/svt-event]
[svt-event title=”కరోనా నివారణకు దేశంలో రెండు వ్యాక్సిన్లు ” date=”01/02/2021,11:10AM” class=”svt-cd-green” ] కరోనా నివారణకు దేశంలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చామన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మరికొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే రాబోతున్నాయన్నారు. [/svt-event]
[svt-event title=”ఆత్మనిర్భర్ భారత్ రూ. 21.17 లక్షల కోట్లు కేటాయించాం ” date=”01/02/2021,11:10AM” class=”svt-cd-green” ] ఆత్మనిర్భర్ భారత్ రూ. 21.17 లక్షల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గరీబ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్భర్ భారత్ కు ఐదు బడ్జెట్ నిధులు కేటాయించామన్నారు. [/svt-event]
[svt-event title=”కేంద్ర బడ్జెట్ 2021-22, నిర్మలమ్మ ప్రసంగం” date=”01/02/2021,11:10AM” class=”svt-cd-green” ] పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…కరోనా పోరాటంలో ఉద్యోగులంతా అండగా నిలిచారని, ఎంపీలు, ఎమ్మెల్యేలు జీతాలను విరాళంగా ఇచ్చారన్నారు. మేడిన్ ఇండియా ట్యాబ్ లో 2021-22 బడ్జెట్ ఉంది. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ట్యాబ్ తయారైంది. [/svt-event]
[svt-event title=”మూడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా” date=”01/02/2021,11:05AM” class=”svt-cd-green” ] పార్లమెంట్ ముందుకు 2021-22 బడ్జెట్ ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఆమెకు మూడోసారి. దేశ చరిత్రలో తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతుల స్థానంలో టాబ్లెట్ ఉపయోగించారు. [/svt-event]
[svt-event title=”పార్లమెంట్ లో బడ్జెట్, ప్లే స్టోర్ లో అప్లికేషన్” date=”01/02/2021,11:02AM” class=”svt-cd-green” ] పార్లమెంట్ లో 2021-22 సంవత్సరానికి బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచునున్నారు. [/svt-event]
[svt-event title=”‘నెవర్ బిఫోర్’ బడ్జెట్” date=”01/02/2021,10:59AM” class=”svt-cd-green” ] పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే 2021-22 సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై అందరి చూపు నెలకొంది. ‘నెవర్ బిఫోర్’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్నాయి. [/svt-event]
[svt-event title=”బడ్జెట్ పై రాహుల్ సూచన” date=”01/02/2021,10:55AM” class=”svt-cd-green” ] కాసేపట్లో పార్లమెంట్ లో 2021-22 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎంఎస్ఈలు, రైతులు, కార్మికులకు ఉపాధి కల్పించడానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఖర్చులు పెంచాలని, సరిహద్దులను కాపాడే విషయంలో రక్షణ వ్యయాన్ని పెంచాలన్నారు. [/svt-event]
[svt-event title=”బడ్జెట్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం” date=”01/02/2021,10:50AM” class=”svt-cd-green” ] ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర మంత్ర నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలిపింది. [/svt-event]
[svt-event title=”పార్లమెంట్ ఆవరణలో కేంద్ర కేబినెట్ సమావేశం” date=”01/02/2021,10:48AM” class=”svt-cd-green” ] కేంద్రబడ్జెట్ ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. 2021, ఫిబ్రవరి 01వ తేదీ సోమవారం ఉదయం పార్లమెంట్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో..కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 2021-22 వార్షిక బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. [/svt-event]
[svt-event title=”ట్యాబ్ తో పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలమ్మ” date=”01/02/2021,10:41AM” class=”svt-cd-green” ] కరోనా కారణంగా…ఆన్ లైన్ లో బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ లో అందించనున్నారు.
https://10tv.in/fm-nirmala-sitharaman-carrying-a-bahi-khata/
సూట్‌కేస్‌లో బడ్జెట్ ప్రసంగ ప్రతులను తీసుకువచ్చే విధానానికి స్వస్తి చెప్పి.. ఎరుపురంగు వస్త్రంలో బహీఖాతా రూపంలో బడ్జెట్ ప్రతులను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా..బడ్జెట్ సమావేశాల్లో మాత్రం ఐ ప్యాడ్ తో పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు మంత్రి నిర్మల. [/svt-event]
[svt-event title=”రాష్ట్రపతిని కలిసిన నిర్మలా సీతారామన్” date=”01/02/2021,10:41AM” class=”svt-cd-green” ] కాసేపట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన విషయాలను మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కోవింద్‌కు వివరించారు. [/svt-event]