Monkey to Life imprisonment : మద్యం తాగి 250మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు

మద్యం తాగి 250మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు విధించారు అధికారులు. మద్యానికి అలవాటు పడిని ఆకోతికి వైద్యం చేయించినా దాని తీరు మారలేదు.దీంతో ఆ కోతికి జీవిత ఖైదు విధించారు.

Monkey to Life imprisonment : మద్యం తాగి 250మందిని కరిచిన కోతికి జీవిత ఖైదు

Monkey to Life imprisonment

Updated On : November 26, 2022 / 11:10 AM IST

Monkey to Life imprisonment : ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ..ఓ కోతికి జీవిత ఖైదు విధించారు. అంటే యావజ్జీవ కారాగార శిక్ష. అంటే అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. వినటానికి ఇది వింతగా ఉన్నా..నిజమే. దీనికి కారణం ఓ మనిషి. తాను చెడ్డ కోతి వనమంతా చెరిచింది అంటారు పెద్దలు. కానీ ఇక్కడ కోతిని ఓ మనిషి చెడగొట్టాడు. దాని మానాన అది దొరికినవి తింటూ బతికేది. కానీ ఓ మాంత్రికుడు దాని పద్దతి మార్చేశాడు. మద్యం తాగే అలవాటున్న సదరు మాంత్రికుడు తన వద్దకు వచ్చే కోతికి కూడా మద్యంతో పాటు మాంసం తినటం కూడా అలవాటు చేశాడు. ఆ కోతికి మద్యం, ఎంతగా అలవాటైపోయిదంటే..మద్యం లేకపోతే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తించేది. సాధారణంగా కల్లు తాగిన కోతి చెట్లమీద ఇష్టమొచ్చినట్లుగా గెంతులేస్తు కొమ్మల్ని విరిచేస్తు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది. కానీ ఈ కోతి మాత్రం మద్యం లేకపోతే పిచ్చెక్కిపోతుంది. ఈకోతికి మద్యం తాగినా..తాగకపోయినా పిచ్చిపిచ్చిగానే ప్రవర్తిస్తుంది.దాన్ని అలా తయారు చేశాడు సదరు మాంత్రికుడు. ఆ కోతికి ‘కాలియా’అనే పేరు కూడా పెట్టుకున్నాడు.

Viral Video : కలెక్టర్ కళ్లద్దాలు ఎత్తుకెళ్లిన కోతి..లంచం తీసుకుని తిరిగి ఇచ్చింది

మద్యానికి, మాంసానికి అలవాటు పడిన కోతి ఆ రెండింటికి అది బానిసగా మారిపోయింది. 2017లొ సదరు మాంత్రికుడు చనిపోయాడు. దీంతో ఆ కోతికి మద్యం తాగించేవారు లేకుండాపోయారు. దీంతో ఇక చూడాలి దాని పిచ్చి చేష్టలు. కనిపించినవారిపై దాడికి దిగేది.చేయటం కొరికేయటం..రక్కేయటం ఇష్టానుసారంగా చేసేది. ఈక్రమంలో దానికి ఓ మద్యం దుకాణం కనిపించింది. అంతే అక్కడ సెటిల్ అయిపోయింది.మద్యం దుకాణం వద్ద కాపుకాసి..మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని ఎత్తుకెళ్లేది. అలా 250మందిని కరిచింది. వీరిలో ఒకరు మృతి చెందారు.దీంతో ఆ కోతి ఎక్కడ నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానికులు హడలిపోయేవారు. దాని బాధలు భరించలేక జూ, అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Monkeys Revenge on Dogs :కుక్కలపై పగ తీర్చుకున్న కోతులు..250 కుక్క‌పిల్లలను ఎలా చంపాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అధికారులు అతి కష్టంమీద దాన్ని పట్టుకుని కాన్పూర్ జూకు తరలించారు.దానికి వైద్యం అందించారు. ఐదేళ్లపాటు దానికి వైద్యం అందించినా దాని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవటం గమనించాల్సిన విషయం. ఇలాంటి కోతిని ఇక బయటకు వదిలితే ప్రమాదమని భావించిన జూ అధికారులు ఇకపై దానిని జూలోనే జీవితాంతం బందీగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు.

Dual Gender Stick Insect : డబుల్ జెండర్ గొల్లభామ.. సగం ‘ఆడ’ సగం ‘మగ’