Varalaxmi Sarathkumar : వ్యాక్సిన్ వేయించుకోమని వెరైటీగా చెప్పిన వరలక్ష్మీ శరత్‌కుమార్..
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్..

Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar: అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా ఒక వీడియో ద్వారా తెలిపారు.
‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా తీవ్రత మనలో తక్కువగా ఉంటుంది. ప్రాణాలకు హాని ఉండదు. అలాగే వ్యాక్సిన్ వేయించుకున్న అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా అవి నార్మలే.
ఇంకో విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ వేయించు కున్నవారు ఎవరూ ఇంత వరకు చనిపోలేదు. శరీరంలో మరేదైనా సమస్య ఉంటే దాని కారణంగా మరణించారు. ఒకవేళ ఏదైనా ఆనారోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్యుల సలహాలు, సూచనలు అడిగి అప్పుడు వ్యాక్సిన్ వేసుకోండి. వ్యాక్సిన్ వేయించుకుందాం.. కరోనాను తరిమేద్దాం’’ అని వీడియో ద్వారా తెలిపారు..
వ్యాక్సిన్ వేయించుకుందాం…కరోనాను తరిమేద్దాం – నటి వరలక్ష్మీ శరత్‌కుమార్@varusarath5 #VaccinateIndia #VaccineForAll pic.twitter.com/Z3LUxaeSON
— satish @10tv news (@SatishKottangi) June 4, 2021