Venkaiah Naidu: వెంకయ్య దారెటు? రాష్ట్రపతి అభ్యర్థా..? ఉప రాష్ట్రపతిగా కొనసాగింపా?
అబ్దుల్ కలాం తర్వాత వరుసగా మూడుసార్లు ఉత్తరాది వాసులకే రాష్ట్రపతి పీఠం దక్కింది. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్... వీరంతా ఉత్తరాదికి చెందిన వారే. అందుకే ఈ సారి దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Venkaiah Naidu
Venkaiah Naidu: బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ తరఫున ఇంకా రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించలేదు. ఈ విషయంలో పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గంటపాటు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరంతా వెంకయ్య నాయుడును ఏ ఉద్దేశంతో కలిశారు అనే విషయంలో స్పష్టత లేదు.
presidential polls: వెంకయ్య నాయుడితో నడ్డా, షా, రాజ్‌నాథ్ భేటీ.. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ?
అయితే, ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడమో లేక.. ఉప రాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అబ్దుల్ కలాం తర్వాత వరుసగా మూడుసార్లు ఉత్తరాది వాసులకే రాష్ట్రపతి పీఠం దక్కింది. ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్ నాథ్ కోవింద్… వీరంతా ఉత్తరాదికి చెందిన వారే. అందుకే ఈ సారి దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వెంకయ్య నాయుడు పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ సీనియర్ నేతలు వాజ్‌పేయి, అద్వానీ తరం నేతగా వెంకయ్య నాయుడుకు గుర్తింపు ఉంది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతోపాటు, నాటి రాజకీయాల నుంచి నేటి రాజకీయాల వరకు అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. మరోవైపు దక్షిణాదికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతిని చేయడం ద్వారా ఈ ప్రాంతంలో బీజేపీ పట్టు సాధించేందుకు అవకాశం ఉంది.
Girl Kidnapped: మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మేనమామ.. ఆట కట్టించిన పోలీసులు
అద్వానీకి సన్నిహితులైన వారిని పక్కనపెడుతున్నారని, అలాగే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారనే వాదనను తోసిపుచ్చేందుకు కూడా వెంకయ్య నాయుడి ఎంపిక సమాధానమవుతుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు వెంకయ్య నాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్, డీఎమ్‌కే వంటి పార్టీలు ఏకపక్షంగా మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. గతంలో కూడా పలువురు ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారు తర్వాత రాష్ట్రపతి కూడా అయ్యారు. సర్వేపల్లి రాధా క్రిష్ణన్, వి.వి.గిరి, నీలం సంజీవ రెడ్డి, ఆర్.వెంకట రామన్, శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్.నారాయణన్, జాకీర్ హుస్సేన్.. ఉప రాష్ట్రపతిగా చేసిన తర్వాత రాష్ట్రపతిగా సేవలందించారు.