Viral Video: పాముపై అడుగు వేయబోయిన బాలుడు.. మెరుపువేగంతో స్పందించి ప్రాణాలు కాపాడిన అమ్మ

పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఓ పిల్లాడు, అతడి తల్లి బయటకు వస్తున్నారు. అప్పటికే మెట్ల కింద ఓ పొడవాటి పాము ఉంది.

Viral Video: పాముపై అడుగు వేయబోయిన బాలుడు.. మెరుపువేగంతో స్పందించి ప్రాణాలు కాపాడిన అమ్మ

Viral Video

Updated On : August 13, 2022 / 9:30 PM IST

Viral Video: పాముపై అడుగు వేయబోయాడు ఓ బాలుడు. దీంతో ఆ పాము తప్పించుకుని బుస కొట్టింది. కాటు వేయడానికి పడగ విప్పింది. దీంతో మెరుపువేగంతో స్పందించిన ఆ బాలుడి తల్లి అతడి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి ఓ పిల్లాడు, అతడి తల్లి బయటకు వస్తున్నారు. అప్పటికే మెట్ల కింద ఓ పొడవాటి పాము ఉంది.

ఆ విషయాన్ని తల్లీకొడుకులు గమనించలేదు. ఆ బాలుడు ఎప్పటిలాగే మెట్లు దిగాడు. దీంతో పాము ఒక్కసారిగా వెనకకు జరిగి, పడగ విప్పి కాటేయబోయింది. వెంటనే ఆ బాలుడిని తల్లి ఎత్తుకుని పాముకు దూరంగా వెళ్ళింది. ఆ తల్లి స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె పామును చూడడం, బాలుడిని లాగడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే బాలుడి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేకపోతున్నామని కామెంట్లు చేస్తున్నారు. నిజంగా ఊహించిన రీతిలో పాము బారి నుంచి బయటపడ్డారు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రతిచోటా దేవుడు ఉండలేకే అమ్మను రక్షణగా పంపాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. నమ్మలేకపోతున్నామంటూ ఈ వీడియోపై మరి కొందరు కామెంట్లు చేశారు.