Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
కల్యాణ లక్ష్మి సంతకాలం కోసం వెళ్లిన మహిళపై గ్రామ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు పెడతానని మహిళ హెచ్చరించినప్పటికీ గ్రామ కార్యదర్శి వేధింపులు మానలేదు. దీంతో వేధింపులు తట్టుకోలేక గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది.

Woman Suicide
Woman Suicide: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. లైంగిక వేధింపులకు గురైన మహిళ, అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బయ్యారం మండలం కేంద్రంలో జరిగింది. కల్యాణ లక్ష్మి సంతకాలం కోసం వెళ్లిన మహిళపై గ్రామ కార్యదర్శి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై కేసు పెడతానని మహిళ హెచ్చరించినప్పటికీ గ్రామ కార్యదర్శి వేధింపులు మానలేదు. దీంతో వేధింపులు తట్టుకోలేక గ్రామ సర్పంచ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా, మహిళకు ఎలాంటి న్యాయం జరగలేదు.
Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
దీంతో మహిళకు గ్రామ పంచాయతీలో సెటిల్‌మెంట్ చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలో కులపెద్దల సమక్షంలోనే మహిళపై దాడి జరిగింది. దీంతో అవమానం తట్టుకోలేక, మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.