The Golden Joint: ప్రారంభానికి సిద్ధమైన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. మొత్తం ఏడు పిల్లర్లు ఉండగా సంగల్దాన్ అనే పిల్లర్ అత్యంత ఎత్తైంది (103 మీటర్లు). ఇది ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2004లో తలపెట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఎన్నో అవాంతరాలను తట్టుకుని పూర్తైంది.
The Golden Joint: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన ‘ది గోల్డెన్ జాయింట్’ పనులు పూర్తైనట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రైల్వే శాఖ.. ప్రారంభానికి సిద్ధమైనట్లు ప్రకటించింది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా మార్గంలో ఈ బ్రిడ్జిని నిర్మించారు. కత్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ వంతెన కీలకమైన అనుసంధానంగా నిలవనుంది.
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు, పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్నుల ఉక్కును వినియోగించారు. మొత్తం ఏడు పిల్లర్లు ఉండగా సంగల్దాన్ అనే పిల్లర్ అత్యంత ఎత్తైంది (103 మీటర్లు). ఇది ఈఫిల్ టవర్ కన్నా 35మీటర్లు ఎత్తుగా ఉంటుంది. 2004లో తలపెట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం ఎన్నో అవాంతరాలను తట్టుకుని పూర్తైంది.
దీని నిర్మాణం వల్ల ఢిల్లీ నుంచి కశ్మీర్‌కు ప్రయాణ సమయం తగ్గనుంది. ప్రస్తుతం ట్రక్కు రవాణాకు 48 గంటల సమయం పడుతుండగా ఈ బ్రిడ్జి ప్రారంభమైన తర్వాత కేవలం 20 గంటల్లోనే గమ్య స్థానాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల మరో ప్రయోజనం కూడా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రవాణా ఖర్చు తగ్గడం వల్ల వస్తువుల ధరలు కూడా తగ్గుతాయని ఓ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి ఈ బ్రిడ్జిని 2009 డిసెంబర్ నాటికే పూర్తవ్వాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సెప్టెంబర్ 2008లో వంతెన స్థిరత్వం, భద్రత మీద ఆందోళన చెంది రద్దు చేశారు. అనంతరం 2010లో పనులు పున:ప్రారంభమయ్యాయి.
RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్
The Golden Joint: Deck launching work of the world’s highest Railway Arch Bridge, Chenab Bridge completed. pic.twitter.com/nrGF0Mrm6R
— Ministry of Railways (@RailMinIndia) August 13, 2022