Redmi నుంచి 3 కొత్త 10X సిరీస్ ఫోన్లు.. ఫీచర్లు భలే ఉన్నాయి!

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి మూడు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. రెడ్ మి 10ఎక్స్, రెడ్‌మి 10ఎక్స్ 5జీ ప్రో, రెడ్ మి 10 ఎక్స్ 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఈ మూడు ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఒకేలా ఉన్నాయి. రెడ్ మి 10x సిరీస్ నుంచి మూడు మోడల్స్ ఉన్నాయి. అందులో రెండు ఫోన్లు రెడ్ మి 10x, 10x ప్రో 5G నెట్ వర్క్ ఫోన్లు కాగా.. మూడోది రెడ్‌మి 10x 4G స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. యూరప్ నుంచి రెడ్ మి నోట్ 9 మోడల్ ఫోన్ పేరు మార్చేసి రెడ్ మి 10x 4G మోడల్ ఫోన్‌గా మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
5G వేరియంట్లు పూర్తిగా కొత్త స్మార్ట్ ఫోన్లు. 5G డ్యుయో ఫోన్లలో డిఫరెంట్ కెమెరాలు ఉన్నాయి. మోడ్రాన్ చిప్ సెట్, బిగ్ AMOLED స్ర్కీన్లు ఉన్నాయి. 10x ప్రో 5G ఫోన్‌లో 48MP మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 5MP మ్యాక్రో కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 5MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి.
రెడ్‌మి 10x ఫ్లాగ్ షిప్ ఫోన్లు అయినప్పటికీ తక్కువ ధర రూ.17వేల నుంచే మార్కెట్లో అందుబాటులో ఉండనున్నాయి. రెడ్ మి 10x సిరీస్ ఫోన్లు భారత మార్కెట్లోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో కంపెనీ అధికారికంగా ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. రెడ్ మి రిలీజ్ చేసిన మూడు కొత్త ఫోన్లలో ఫీచర్లు, స్పెషిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి..
Redmi 10X 5G సిరీస్ స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.5 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
చిప్ సెట్ : 5G మోడల్ ఫోన్లు mediaTek డైమెన్సిటీ 820 చిప్ సెట్‌తో 5G సపోర్టు
ర్యామ్ : 6GB, 8GB ర్యామ్
స్టోరేజీ : 64GB, 128GB, 256GB స్టోరేజీలు
రియర్ కెమెరాలు : రెడ్ మి 10x 5Gలో క్వాడ్ కెమెరాలు, 48MP మెయిన్ కెమెరా, 8MP వైడ్ యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, డెప్త్ కెమెరా
ఫ్రంట్ కెమెరా : రెడ్ మి 10x 5G ఫోన్లలో 16MP కెమెరాలు, ప్రో మోడల్ లో 20MP కెమెరా ఉంది.
బ్యాటరీ : రెండు మోడళ్లలో 4520mAh బ్యాటరీ, కానీ, రెడ్ మి 10x 5Gలో 22.5W ఫాస్ట్ ఛార్జర్, ప్రో మోడల్ లో 33W ఫాస్టర్ ఛార్జర్ వస్తుంది.
ఓఎస్ : MIUI 12 ఆధారిత ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ పై రన్ అవుతుంది.
ధరలు :
* 6GB ర్యామ్, 64GB స్టోరేజీ ధర 1599 Yuan (రూ.17వేలు)
* 128GB వేరియంట్, 6GB ర్యామ్, 1799 Yuan (రూ.19,100)
* 8GB ర్యామ్, 128GB స్టోరేజీ ధర 2099 Yuan (రూ.22,300)
* టాప్ ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ ధర 2399 Yuan (రూ.25,500)
* రెడ్‌మి 10x pro 5G ఫోన్.. 8GB ర్యామ్, 128GB స్టోరేజీ ప్రారంభ ధర 2299 Yuan (రూ.24,300)
* టాప్ ఎండ్ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీ ధర 2599 Yuan (రూ.27,500)