Young Womens missing : హైదరాబాద్ లో మహిళల అదృశ్యం
హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో మహిళలు అదృశ్యం కావటం పొలీసుల్లో కలకలం రేపుతోంది.

Young Womens Missing In Hyderabad
Young Womens missing in Hyderabad : హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో మహిళలు అదృశ్యం కావటం పొలీసుల్లో కలకలం రేపుతోంది. నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓల్డ్‌సఫిల్‌గూడ, మొఘల్ కాలనీకి చెందిన ఠాకూర్ రాజేశ్వరి(29) ఈనెల 24న భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కోసం తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నర్సింహస్వామి తెలిపారు.
మల్కాజ్ గిరిలో ఇద్దరు మిస్సింగ్
మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో యువతి మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరానెహ్రూనగర్‌కు చెందిన హరిష అలియాస్ పింకీ(25) ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తోంది. ఏప్రిల్ 22వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. ఈ ఘటనపై ఆమె సోదరుడు మహేష్ ఆదివారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోనే మరో యువతి అదృశ్యమైన ఘటన చోటు చేసుకుంది. ఇందిరా నెహ్రూనగర్‌కు చెందిన బాలయ్య భార్య కనకలక్ష్మి, కూతురు అరుణ(20) ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేస్తున్నారు. ఈ నెల 25న కనకలక్ష్మి తన పనిపూర్తి అయిన తర్వాత కూతురు పనిచేసే చోటుకు 9 గంటలకు వెళ్లింది. ఆ ఇంటి యజమాని అప్పటికే అరుణ వెళ్లిపోయింది అని చెప్పారు. ఆమె సెల్‌ఫోన్ పనిచేయకపోవడం, ఇంటికి రాకపోవడంతో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Young Womens missing
బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఉదయశ్రీ (22) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఉదయశ్రీ గత కొంతకాలంగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ నర్సుల హాస్టల్‌లో ఉంటోంది. ఏప్రిల్ 23న ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిన ఉదయశ్రీ తిరిగి రాలేదు.
ఇదే విషయాన్ని హాస్టల్ వార్డెన్ భాగ్యలక్ష్మి ఫోన్ ద్వారా ఉదయశ్రీ తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచారం ఇచ్చింది. ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు శనివారం నగరానికి వచ్చి అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో కూతురు కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.