ఆయుష్మాన్ భారత్ స్కీం : 45లక్షల మందికి ఉచితంగా చికిత్స 

  • Published By: sreehari ,Published On : September 18, 2019 / 09:13 AM IST
ఆయుష్మాన్ భారత్ స్కీం : 45లక్షల మందికి ఉచితంగా చికిత్స 

Updated On : September 18, 2019 / 9:13 AM IST

దేశవ్యాప్తంగా పేదలకు రోగ నివారణ, ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణతో సహా సమగ్ర ప్రాధమిక సంరక్షణ (CPHC) అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2022 నాటికి 1లక్ష 50వేల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్స్ (AB-HWCs) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఇప్పటికే 21వేల సెంటర్లు పనిచేస్తుండగా.. మరో 6 నెలల్లో 20వేల సెంటర్లను చేర్చనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్థన్ తెలిపారు.

ఆయూష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ స్కీమ్ లో భాగంగా ఆరోగ్య, సంరక్షణ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దేశంలోని 50 కోట్ల పేదలందరికి PMJAY స్కీమ్ అందుబాటులో ఉంది. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భీమాను అందిస్తుంది. ఈ స్కీమ్ కింద గడిచిన ఒక ఏడాదిలో 47మంది పేషెంట్లు వైద్యపరంగా ప్రయోజనం పొందినట్టు హర్ష్ వర్ధన్ తెలిపారు. 

5 కోట్ల మంది జనాభాకు అందేలా 21వేల AB-HWC సెంటర్లను ఏర్పాటు చేయగా ఇప్పటివరకూ 1 కోటి 70లక్షల 63వేల 552 పేషెంట్లు వచ్చి ట్రీట్ మెంట్ చేయించుకున్నట్టు తెలిపారు. ఇందులో చాలామంది డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి సమస్యలపై చికిత్స తీసుకున్నారు. వారిలో 1.5 కోట్ల మంది హైపర్ టెన్షన్ పరీక్ష చేయించుకుంటే (70 లక్షల మందికి పైగా చికిత్స తీసుకున్నారు) 1.3 కోట్ల మంది డయాబెటిస్ పరీక్షలు చేయించుకుంటే.. (31లక్షల మందికి పైగా చికిత్స పొందుతున్నారు). 76 లక్షల మంది నోటి క్యావిటీ కేన్సర్ పరీక్ష చేయించుకుంటే.. 10వేల 218 మంది చికిత్స తీసుకుంటున్నారు. రొమ్ము కేన్సర్ సోకిన 53లక్షల మంది మహిళలు పరీక్షలు చేయించుకుంటే. 9వేల 700 మంది మహిళలు చికిత్స తీసుకున్నారు. 

ఈ స్కీమ్ కింద.. 1.6 కోట్ల మంది ప్రజలు ఉచితంగా మందులు, 49 లక్షల డయాగ్నిస్టిక్ సర్వీసులను పొందినట్టు మంత్రి హర్ష్ వర్థన్ చెప్పారు. గత ఏడాదిలో ఆయుష్మాన్ స్కీమ్ ద్వారా.. 47లక్షల మంది పేషెంట్లకు చికిత్స కోసం ఖర్చు చేసిన 7వేల 500 కోట్ల ఆస్పత్రుల బిల్లలను చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వినియోగించిన మొత్తంలో 55 శాతం వరకు మూడో కార్యసరళి కోసం ఖర్చు చేసినట్టు తెలిపింది. PM-JAY స్కీమ్ తొలి వార్షికోత్సవం సందర్భంగా మంత్రి హర్ష్ వర్థన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పథకంలో భాగమయ్యాయని ప్రకటించారు.