Milk : రోజుకు గ్లాసు పాలు..ఆరోగ్యానికి ఎంతో మేలు!

కీళ్ల నొప్పులతో బాధపడేవారు నైట్ నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పావు టేబుల్ స్పూన్ శొంఠి పొడిని కలిపి సేవించాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Milk : రోజుకు గ్లాసు పాలు..ఆరోగ్యానికి ఎంతో మేలు!

Glass Of Milk

Updated On : June 5, 2022 / 10:00 AM IST

Milk : పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పాలు ఎంతో మేలు చేస్తాయి. పాలల్లో క్యాల్షియం ఫాస్పెట్ , పొటాషియం ఫాస్పెట్ , సోడియం క్లోరైడ్ , పొటాషియం క్లోరైడ్ , ఐరన్ ఫాస్ఫెట్ , మాంగనీస్ ఫాస్పెట్ ఉంటాయి. విటమిన్లు A , B , C , D , E , O పాలలో ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరు తమ డైలీ డైట్‌లో ఒక గ్లాస్ పాలను తప్పకుండా చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి. పాలలో ఉండే కాల్షియం కొవ్వు తగ్గడానికి ఉప‌క‌రిస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుకుంటుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారు నైట్ నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో పావు టేబుల్ స్పూన్ శొంఠి పొడిని కలిపి సేవించాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ప్ర‌తి రోజూ తక్కువ ఫ్యాట్‌ కలిగిన పాలను తాగితే, టైప్‌-2 మధుమేహ వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా వరకు త‌గ్గ‌తాయి. నిద్రలేమితో బాధపడే వాళ్ళకు పాలు బాగా స‌హాయ‌ప‌డ‌తాయి. ప్ర‌తి రోజు ప‌డుకునే ముందు ఓ గ్లాసుడు పాల‌లో తేనె క‌లిపి తాగితే నిద్రబాగా పడుతుంది.

గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలతో సతమతం అయ్యేవారు.. రాత్రుళ్లు నిద్రించే ముందు గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా జాజికాయ పొడిని కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే ఆయా జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. పాలు తాడగడం వల్ల పురుషుల్లో హర్మోన్లు చురుగ్గా పనిచేస్తాయి. పాలలోని కాల్షియం, సోడియం, పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి.

మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రిళ్లు పాలు తాగడం మంచిది. పాలు తాగడం వల్ల ఒత్తిడి, చిరాకు దూరమవుతుంది. కొందరు పాలను ఉదయం తాగితే, మరికొందరు రాత్రుళ్లు తాగుతారు. ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి మంచిదే. రాత్రిళ్లు పాలు తాగిన వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కనీసం గంట లేదా రెండు గంటలకు ముందే పాలు తాగాలి. పాలల్లో ఎక్కువగా ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపడం వల్ల అలర్జీలు ఏర్పడతాయి. అలర్జీ లక్షణాలు కనిపించిన వారు పాలు తాగే విషయంలో జాగ్రత్త వహించాలి.