Almonds : పొట్ట పెరగకుండా స్లిమ్ గా ఉండాలంటే బాదంతో!
ప్రతిరోజు 42 గ్రాముల బాదం పప్పులు తింటే పొట్ట సమస్య రాదు. పిండిపదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహారపదార్ధాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు.

Growing Belly Fat
Almonds : మారిన జీవనశైలీ, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయి బాధపడుతున్న వారికి బాదం పప్పు మంచి పరిష్కారమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బాదం పప్పు తింటే పొట్ట పెరగకుండా చూసుకోవటం తోపాటు స్లిమ్ గా కూడా ఉండవచ్చని చెబుతున్నారు. అనేక అధ్యయనాల్లో ఈ విషయంలో తేలినట్లు స్పష్టం చేస్తున్నారు. రోజు తీసుకునే ఆహారంతోపాటుగా బాదం పప్పులు తీసుకుంటే మంచిది. వీటిని తీసుకోవటం వల్ల పొట్ట తగ్గటంతోపాటుగా గుండె జబ్బుల ముప్పు తప్పుతుంది.
ప్రతిరోజు 42 గ్రాముల బాదం పప్పులు తింటే పొట్ట సమస్య రాదు. పిండిపదార్ధాలు ఎక్కవగా ఉండే ఆహారపదార్ధాల బదులు బాదం పప్పులు తింటే గుండెకు సంబంధించిన రకరకాల అనారోగ్య సమస్యలను నియంత్రించవచ్చు. గుండు రక్తనాళాలు సాఫీగా ఉండి రక్త ప్రసరణ బాగా ఉంటుంది. బాదం పప్పును స్నాక్స్ గా తీసుకునే వారిలో పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ తోపాటు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బాదంపప్పులో మోనో శ్యాచురేటెడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్‌కి, బ్రెయిన్‌కి మరియు స్కిన్‌కి మేలు చేస్తాయి. అలాగే విటమిన్ E, మెగ్నీషియం మరియు పొటాషియం బాదంపప్పులో ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ నార్మల్‌గా ఉండటానికి సహాయపడతాయి. అలాగే రక్త ప్రసరణ సజావుగా సాగడానికి సహకరిస్తాయి. రోజుకి 4 నుంచి 7 బాదంపప్పులు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అన్ని రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, సూక్ష్మ పోషకాలు బాదంలో ఉంటాయి. ఎముకల ఆరోగ్యంగా , పటుత్వంగా ఉండేందుకు బాదంలో ఉండే పాస్పరస్, కాల్షియం తోడ్పడతాయి. కడుపునొప్పి, మలబద్దకం సమస్యతో బాధపడేవారు బాదం క్రమం తప్పకుండా తింటే సమస్య తొలగిపోతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బాదంలో ఉండే రాగి, ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్ధాయిని పెంచి రక్త హీనతను తొలగిస్తాయి.