Suffering From Dandruff : చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా ? మెంతులు, మందార ఆకులతో ఇలా చేసి చూడండి !
చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఖరీదైన షాంపులను వాడుతూ ఉంటారు. అయితే మనకు దగ్గరలో సులభంగా లభించే పదార్థాలతో చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు.

suffering from dandruff
Suffering From Dandruff : చలికాలంలో ఎక్కువ మందిని వేధించే సమస్యల్లో తలలో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఇది ఒకసారి వస్తే అంత ఈజీగా పోదు. దీని కారణంగా జట్టు రాలిపోతూ ఉంటుంది. ఈ సమస్యను సహజ నివారణలతో సులభంగా దూరం చేసుకోవచ్చు. శీతాకాలంలో గాలిలో మలాసెజియా అనే ఫంగస్ ఉంటుంది. ఇది తలపై చుండ్రుకు రావటానికి కారణమవుతుంది. దీంతోపాటుగా అధిక ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, విటమిన్స్ లోపం వల్ల కూడా చుండ్రు సమస్య వస్తుంది.
READ ALSO : Alasanda Cultivation : అలసంద సాగులో పంటకోత.. కోత అనంతరం జాగ్రత్తలు !
చుండ్రు కారణంగా జుట్టు రాలడం, దురద వంటి ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి ఖరీదైన షాంపులను వాడుతూ ఉంటారు. అయితే మనకు దగ్గరలో సులభంగా లభించే పదార్థాలతో చుండ్రు సమస్యను వదిలించుకోవచ్చు. సహజసిద్ధంగా లభించే పదార్ధాలను వాడడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు జుట్టుకు ఎటువంటి హాని కలగదు. అంతేకాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరుగుతుంది.
READ ALSO : Protecting Your Lungs : ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి !
చుండ్రు సమస్యను తగ్గించే మందార, మెంతులు ;
చుండ్రు సమస్య నుండే బయటపడాలనుకునే వారికి మందార పువ్వులు, లేదా ఆకులు, వెంతులు బాగా ఉపకరిస్తాయి. ఈ రెండితోపాటు మరికొన్ని పదార్ధాలను తీసుకుని చుండ్రు సమస్యను తరిమి కొట్టొచ్చు. అందుకు గాను ఏమేమి పదార్దాలు తీసుకోవాలో చూద్దాం.. 2ఎండిన ఉసిరికాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల కాళోంజి విత్తనాలు, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, 4 మందార ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఉసిరికాయ ముక్కలు, కాళోంజి విత్తనాలు, మెంతులు వేసి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తరువాతి రోజు ఈ వీటిని నీటితో సహా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే మందార ఆకులను కూడా వేయాలి.
READ ALSO : Turmeric Cultivation : పసుపుసాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు
మెత్తని పేస్ట్ అయ్యాక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె కలిపి తల చర్మానికి రాసుకోవాలి. జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు రాయాలి. రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి. తరువాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారి చేయడం వల్ల చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను అనుసరించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.