Air Quality and Kidney Health : వాయు కాలుష్యంతో కిడ్నీలకు ముప్పే ! తస్మాత్ జాగ్రత్త
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మూత్రపిండాల ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు వల్ల మూత్రపిండ వ్యాధులు పెరుగుతాయి. హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది.

Air Quality and Kidney Health
Air Quality and Kidney Health : యు కాలుష్యం అన్నది. మన దేశంలో ప్రజల ఆరోగ్యానికి గణనీయమైన ముప్పుగా తయారైంది. అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రతి ఏడాది కలుషితమైన గాలిలోని సూక్ష్మ కణాలకు గురికావడం వల్ల 7 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు అంచనాలు చెబుతున్నాయి. స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు వాయుకాలుష్యమే కారణం. ఇదిలా ఉంటే గాలి నాణ్యత కిడ్నీ ఆరోగ్యం పై నా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : Jaggery Tea : బరువు తగ్గటంతోపాటు, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి నుండి ఉపశమనం కోసం బెల్లం టీ !
మనం దైనందిన జీవితంలో అనేక విషయాల గురించి మాట్లాడుతుంటాము. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తుంటాము. కాని మనం పీల్చే గాలి విషయంలో మాత్రం ఆలోచించము. నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై వాయుకాలుష్యం ప్రభావం గుర్తించలేకపోయినప్పటికీ మనం పీల్చే గాలి సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. గాలి నాణ్యత, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుందన్న విషయం గురించి ఇంతవరకు ఎవరూ ఆలోచించి కూడా ఉండరు.
READ ALSO : Capsicum Helps Kidneys : కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచటంలో దోహదపడే క్యాప్సికమ్ !
కనిపించని ముప్పు ;
శ్వాసకోశ ఆరోగ్యంపై కాలుష్య కారకాల ప్రభావం అందరిని ఆందోళన కలిగిస్తుంది. గాలి నాణ్యత సరిగా లేకపోతే ఆ ప్రభావం మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?
వాయు కాలుష్యం ఎలా వ్యాపిస్తుంది:
కాలుష్య కారకాలు మన శరీరంలోకి చొచ్చుకుపోతాయి. సూక్ష్మమైన నలుసు పదార్థాలు, కర్బన సమ్మేళనాలు శ్వాసకోశ వ్యవస్థ ద్వారా గాలిలో ఉండే ఇతర కలుషితాలు లోపలికి వెళతాయి. స్వల్పకాలంలో, ఇది శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తుంది. అదే సమయంలో ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని వివిధ అవయవాలపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి స్తుంది.
మూత్రపిండాలపై ప్రభావం ;
మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి, రక్తం నుండి వ్యర్థాలను ,అనవసరమైన ద్రవాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు అనుకోకుండా వాయు కాలుష్యానికి గురైతే CKDతో పాటు మూత్రపిండ వైఫల్యం వంటి రుగ్మతలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషపూరిత గాలి మూత్రపిండాల వడపోత సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.
READ ALSO : Uncontrolled Blood Sugar : డయాబెటిక్ రోగులకు బ్లడ్ షుగర్స్ స్ధాయి అదుపుతప్పితే కిడ్నీలు దెబ్బతింటాయా?
మూత్రపిండాలపై ఒత్తిడి ;
కలుషితమైన గాలిని పీల్చడం వల్ల మూత్రపిండాల ఆక్సీకరణ ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య కారకాలు వల్ల మూత్రపిండ వ్యాధులు పెరుగుతాయి. హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు కూడా దారితీసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది నెమ్మదిగా కిడ్నీ పనిచేయని పరిస్ధితి దారితీస్తుంది.
READ ALSO : Healthy kidney : మూత్ర పిండాల ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే ?
మన కిడ్నీలను రక్షించడం:
వాయు కాలుష్యం మూత్రపిండాల ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తున్న నేపధ్యంలో మన మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు బయటి గాలి నాణ్యతను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో కాలుష్య కారకాలకు గురికావడాన్ని తగ్గించుకోవాలి. మంచి గాలిని పీల్చటం ద్వారా శ్వాససంబంధిత సమస్యలతోపాటు శరీరంలోనే ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈసమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.