Cluster Beans : బరువు తగ్గించి, మధుమేహులకు మేలు చేసే గోరు చిక్కుడు!

గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్‏గానూ తీసుకోవచ్చు.

Cluster Beans : బరువు తగ్గించి, మధుమేహులకు మేలు చేసే గోరు చిక్కుడు!

Chikkudu

Updated On : July 17, 2022 / 2:19 PM IST

Cluster Beans : గోరు చిక్కుడు రోజువారీ ఆహారంలో దీనిని తీసుకుంటే మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. గోరు చిక్కుడు తినడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇందులో అనేక రకాల పోషకాలున్నాయి. కేలరీల కంటెంట్ తక్కువగా మరియు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడమే కాకుండా, గుండె సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. జీవనశైలి, పని ఒత్తిడి,ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు సమస్య నుండి బయటపడేందుకు రోజువారి ఆహారంలో గోరు చిక్కుడు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గోరు చిక్కుడు బరువు తగ్గించడంలో సహయపడుతుంది. ఊబకాయం సమస్యను తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.  దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. దీనిని కూరగానే కాకుండా, సలాడ్‏గానూ తీసుకోవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. పొట్ట శుభ్రమవుతుంది. అలాగే ఇందులో కాల్షియం ఉన్న కారణంగా ఎముకలు బలంగా ఉంటాయి. దీనిలో ఉండే భాస్వరం, కాల్షియం కూడా ఎముకలను బలోపేతం చేయడానికి తోడ్పడతాయి.

గర్భిణీ స్త్రీల కోసం ఒక ఉత్తమ ఆహారంగా ఉంది. పిండం యొక్క సాధారణ అభివృద్ధిని ప్రేరేపించడం ద్వారా బిడ్డ పుట్టుక సమస్యలను తగ్గిస్తుంది. గోరుచిక్కుడు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ చంపడం ద్వారా క్యాన్సర్ సంబంధిత సమస్యలు నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి ఉపయోగపడే ఫైబర్ ను కలిగి ఉంటుంది. గోరుచిక్కుడు కాయ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి అవసరమైన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం లో సహాయ పడుతుంది. గోరుచిక్కుడు ను ఆహారంగా తీసుకుంటే కంటి సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ఆ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.

ర‌క్త హీన‌త స‌మ‌స్య‌తో బాధ ప‌డేవారు వారానిరికి రెండు సార్లు గోరు చిక్కుడుని తీసుకుంటే ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది. ఫ‌లితంగా ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ తొలగిపోతుంది. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యర్థాలను బయటకు పంపే గుణం దీనికి ఉంటుంది. గోరు చిక్కుడులోని హైపోగ్లైసియామిక్‌ గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. మధుమేహంతో బాధపడే వారికి గోరు చిక్కుడు వంటలు ఉపయోగకరం. రక్తంలో చక్కెర స్థాయిని ఇది నియంత్రిస్తుంది.