Covaxin For Children : రెండేళ్లకు పైగా పిల్లల్లో సెప్టెంబర్ నాటికి కొవాగ్జిన్ టీకా: ఎయిమ్స్ చీఫ్
సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు.

Covaxin For Children Above 2 Years By September
Covaxin for children above 2 years by September : సెప్టెంబరు నాటికి రెండేళ్లు పైబడిన పిల్లలకు కొవాగ్జిన్ అందిస్తామని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. ఫేజ్ 2/3 ట్రయల్స్ పూర్తి అయిన తర్వాత పిల్లల కోసం కొవాక్సిన్ డేటా సెప్టెంబర్ నాటికి లభిస్తుందని తెలిపారు. అదే నెలలోనే టీకాకు ఆమోదం కూడా లభిస్తుందని కొవిడ్-19పై ప్రముఖ పల్మోనాలజిస్ట్, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. భారతదేశంలో ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ వస్తే.. అది పిల్లలకు కూడా ఒక ఎంపికగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ ట్రయల్స్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ ఇప్పటికే పిల్లలను పరీక్షించడం ప్రారంభించిందన్నారు. జూన్ 7న ప్రారంభం కాగా.. 2ఏళ్ల నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలే ఉన్నారు. మే 12న, రెండు ఏళ్ల వయస్సులోపు పిల్లలపై కొవాక్సిన్ దశ 2, దశ 3 పరీక్షలను నిర్వహించడానికి డీసీజీఐ భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చింది. ఇన్స్టిట్యూట్‌లు సూపర్-స్ప్రెడర్‌లుగా మారకుండా నిరోధించే విధంగా ఇప్పుడు పాఠశాలలను తెరిచే దిశగా యోచన చేయాలని గులేరియా అన్నారు.
సెరో సర్వేల ప్రకారం.. పిల్లలలో యాంటీబాడీలు ఉత్పత్తి కోసం.. సెరో సర్వేలు సూచించాయని డాక్టర్ గులేరియా చెప్పారు. కరోనాకు పిల్లలు ఎక్కువగా ప్రభావితం అవుతారనడానికి తనకు ఎలాంటి కారణం లేదని చెప్పారు. పిల్లలు కూడా ట్రయల్స్ నిర్వహిస్తే.. వారిలోనూ యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయని అన్నారు, దేశంలో పిల్లలు కూడా కరోనాకు గురయ్యారని, వారికి టీకాలు వేయకపోయినా వారిలో కొంత మొత్తంలో నేచురల్ ఇమ్యూనిటీని పొందే అవకాశం ఉంది.
ఢిల్లీ ఎయిమ్స్ WHO సంయుక్తంగా అధ్యయనం చేయగా.. పిల్లలలో అధిక సెరో-పాజిటివిటీ ఉన్నట్టు కనుగొన్నారు. కొవిడ్ థర్డ్ వేవ్ ఇతరులకన్నా పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేయదని ఈ అధ్యయనం ప్రారంభ ఫలితాల్లో తేలింది.