Blue Tea : యంగ్ గా కనిపించాలంటే.. బ్లూ టీ తాగండి..

బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తలకు రక్తప్రసరణ పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. డయాబెటిస్ పేషేంట్లు రెగ్యులర్ టీ కాకుండా బ్లూ టీ

Blue Tea :  యంగ్ గా కనిపించాలంటే.. బ్లూ టీ తాగండి..

Blu Tea

Updated On : October 2, 2021 / 12:47 PM IST

Blue Tea : పొద్దున నిద్రలేచిన వెంటన టీ తాగకుంటే ఏదో కోల్పోయిన వారిలా ఉంటారు.  ఆరోగ్యంపై శ్ర‌ద్ధ ఉన్న చాలా మంది ఇటీవలి కాలంలో సాధార‌ణ టీ లు కాకుండా హెర్బ‌ల్ టీ లు తాగుతున్నారు. వాటిల్లో మ‌న‌కు అనేక ర‌కాల టీలు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి వెరైటీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ బ్లూ టీ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ప్రస్తుతం బ్లూ టీని తాగేందుకు అనేక మంది మక్కువ చూపిస్తున్నారు.

బ్లాక్ టీ, గ్రీన్ టీ, రెడ్ టీ ఇలా ఎన్నో వెరైటీ టీలు మార్కెట్లో ఉన్నాయి. గ్రీన్ టీ దశాబ్ద కాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ మనలో చాలామంది బ్లూ టీ గురించి తెలియదు. మిగతా వాటన్నింటి కంటే బ్లూ టీ చాలా బెటర్ అంటున్నారు దాన్ని తాగిన వారు. బ్లూ టీని అపరాజిత పుష్పాలతో తయారు చేస్తారు. బ్లూ కలర్ లో ఉండే ఈ టీ రంగు కారణంగా చాలా మంది లైక్ చేయరు. అయితే ఈ టీ తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. బ్లూ టీతో ఎన్నోఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

బ్లూ టీలో యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వయసు ఎక్కువగా ఉన్నా కనిపించదు. దీన్ని డైలీ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాలేయంలో పిత్తరస ఉత్పత్తికి బ్లూ టీ దోహద పడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు. బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసాటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. చర్మంపై ముడతలు పడకుండా యంగ్ లా కనిపించేలా చేస్తుంది.

బ్లూ టీలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఈ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. తలకు రక్తప్రసరణ పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. డయాబెటిస్ పేషేంట్లు రెగ్యులర్ టీ కాకుండా బ్లూ టీ తాగితే చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఈ టీ తాగితే రోజంతా ఉల్లాసంగా ఉంటారు. బ్లూ టీని క్రమం తప్పకుండా తాగడం వలన క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది. క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

అపరాజిత మొక్క పువ్వుల‌ను ఎండ‌బెట్టి బ్లూ టీని త‌యారు చేస్తారు. నిజానికి ఈ మొక్క మ‌న చుట్టు ప‌రిస‌ర ప్రాంతాల్లోనే పెరుగుతుంది. దీని పువ్వుల‌ను తెంచి నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేయాలి. అనంత‌రం ఆ పొడిని నీటిలో వేసి బాగా మ‌రిగించాలి. దీంతో డికాషన్ త‌యార‌వుతుంది. దాన్ని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉండ‌గానే తాగాలి. రుచికి అందులో నిమ్మ‌ర‌సం లేదా తేనె క‌లుపుకోవ‌చ్చు.