Stress : ఒత్తిడి గుండెజబ్బులకు దారితీస్తుందా?

ఒత్తిడి ధమనులలో మంటకు దారితీస్తుందని, రక్తం గడ్డకట్టడాన్ని పెంచుతుంది. రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తుందని బృందం పేర్కొంది. ఇది మీ ధమని గోడలలో , చుట్టుపక్కల కొవ్వులు,

Stress : ఒత్తిడి గుండెజబ్బులకు దారితీస్తుందా?

Stress

Updated On : January 7, 2022 / 11:29 AM IST

Stress : మనిషి శరీరంలో గుండె ముఖ్యమైన అవయవం. గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే రక్తపోటు, పొగతాగటం, బరువు, ఊబకాయం వంటి సమస్యల కారణంగా గుండె ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. అయితే తాజా పరిశోధనల్లో ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఇదే పరిశోధన వివరాలు ది లాన్సెట్ లో ప్రచురించబడ్డాయి.

స్ధిరమైన ఒత్తిడి వల్ల మెదడులో ఉద్వేగాలకు కారణమై తద్వారా రక్త ప్రసరణలో మార్పులు చోటు చేసుకుంటాయి. చివరకు గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని కనుగొన్నారు. దూమపానం చేసేవారితోపాటు, అధిక రక్తపోటుతో బాధపడేవారిలో ఒత్తిడి అధికంగా ఉంటుందని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. 293 మంది పై జరిపిన రెండు విడతల పరిశోధనల్లో ఒత్తడికి గురైనప్పుడు వారి మెదడులో వచ్చిన మార్పులను స్కాన్ చేయటం ద్వారా పరిశీలన జరిపారు. ఆసమయంలో మెదడులోని ఒత్తిడిగురైన ప్రాంతం నుండి అదనపు తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయటానికి ఎముక మజ్జకు సంకేతాలు ఇవ్వటాన్ని గుర్తించారు. దీని వల్ల ధమనులు వాపుకు గురై గుండెపోటుకు దారి తీసే క్రమంలో తీవ్రమైన మంట ఉత్పన్నమవ్వటాన్ని పరిశీలించారు.

ఒత్తిడి ధమనులలో మంటకు దారితీస్తుందని, రక్తం గడ్డకట్టడాన్ని పెంచుతుంది. రక్తనాళాల పనితీరును దెబ్బతీస్తుందని బృందం పేర్కొంది. ఇది మీ ధమని గోడలలో , చుట్టుపక్కల కొవ్వులు, కొలెస్ట్రాల్ వంటి పదార్ధాలు పేరుకుపోయేలా చేస్తుంది. ఇది చివరకు గుండెకు రక్త ప్రసరణ తగ్గి, గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. చివరకు మయోకార్డియల్ ఇస్కీమియా కు దారితీస్తుంది.

ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే ఒత్తిడిని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాంతమైన గుండెపోటు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. గతంలో ఎలుకల్లో జరిగిన పరిశోధనల్లో ఈతరహా పరిస్ధితులను పరిశోధకులు గుర్తించారు. అయితే మనుషుల్లో ఒత్తిడి అనేది గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపటాన్ని తాజా పరిశోధనల్లో మాత్రమే వారు గుర్తించినట్లు తెలిపారు.

ఈపరిశోధన ద్వారా రానున్న రోజుల్లో మెదడు ఒత్తిడి నిర్వాహణ, గుండెజబ్బుల ప్రమాదం, దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి తదితర విషయాలపై పూర్తిస్ధాయిలో పరిశోధనలు జరిపేందుకు వారికి మార్గదర్శకంగా మారింది. రానున్నరోజుల్లో దీనిపై మరిన్ని లోతైన పరిశోధనలు చేయనున్నారు.