Gall Bladder : గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం!

తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల చేడు కొలెస్ట్రాల్ పెరగదు. కొన్ని సందర్భాల్లో శరీరం బరువు పెరిగిపోతే పిత్తాశయంలో రాళ్ళూ తయారయే అవకాశాలు ఉంటాయి. ఊబకాయం వల్ల పిత్తాశయ వ్యాధి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది.

Gall Bladder : గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసం!

Gallbladder

Updated On : July 14, 2022 / 2:04 PM IST

Gall Bladder : ఆహారం తీసుకున్న ప్రతిసారీ పిత్తాశయం పిత్తాన్ని విడుదల చేస్తుంది. భోజనం మానేసినప్పుడు పిత్త రసాలు పేరుకుపోతాయి. దీని వల్ల పిత్తాశయంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.. కాలక్రమేణా అవి కాస్తా పిత్తాశయ రాళ్లుగా గట్టిపడతాయి. కొన్ని పిత్త ఆమ్లాలు వల్ల సైతం పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారం జీర్ణమవ్వడానికి సహకరించే గాల్ బ్లాడర్ ఆహారం మానేయడం ద్వారా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని రకాల ఆహారాలు తోడ్పడతాయి.

పిత్తాశయం అనేది బేరి పండు ఆకారంలో ఉంటుంది. కాలేయం లో తయారయ్యే ప్రెత్య రసం ఇందులో నిల్వ ఉంటుంది. మనం ఆహారం తీసుకునే సమయంలో జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోకి ప్రవేశించి, తరువాత పైత్యరసం నేరుగా చిన్న ప్రేగు లోకి విడుదలై ఆహారం జీర్ణ ప్రక్రియలో తోడ్పడుతుంది. ఫైబర్‌తో కూడి ఆహారాలు తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గేలా తోడ్పడుతుంది. ఇది గుండెను రక్షిస్తుంది. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణవ్యవస్థను తోడ్పడి శరీరం నుండి పిత్తాన్ని తొలగిస్తుంది. ధాన్యపు రొట్టె,పాస్తా , బ్రౌన్, వైట్ రైస్,తృణధాన్యాలు వంటివి ఎక్కువ ఫైబర్ ఆహారాలను తీసుకోవటం మంచిది.

తృణ ధాన్యాలు తీసుకోవడం వల్ల చేడు కొలెస్ట్రాల్ పెరగదు. కొన్ని సందర్భాల్లో శరీరం బరువు పెరిగిపోతే పిత్తాశయంలో రాళ్ళూ తయారయే అవకాశాలు ఉంటాయి. ఊబకాయం వల్ల పిత్తాశయ వ్యాధి వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనంలో తేలింది. ఎందుకంటే అదనపు పౌండ్లు పిత్తాశయాన్ని పెద్దవిగా చేస్తాయి. విటమిన్ సి, ఈ, ఫైబర్ అధికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ చేరేందుకు కారణమయ్యే ఫ్రై ఆహారాలు, కొవ్వు అధికంగా వుండే ఆహారాలను తినకూడదు. అవకాడో, ద్రాక్ష, దోస, బ్రకోలీ, నారింజ స్ట్రా బెర్రీ, ఆపిల్, నిమ్మ జాతి పండ్లు, ఉడికించిన బంగాళా దుంపలు వంటి వాటిని ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి.

మధుమేహం సమస్యతో బాధపడేవారు కూడా గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. జంక్ ఫుడ్ వంటి వాటిని వీలైనంత దూరంగా పెట్టాలి. నలభై ఎన్నాళ్ళ వయసు పై బడిన వారు పిత్తాశయం పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. పిత్తాశయ వ్యాధికి ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే స్వీట్లకు దూరంగా ఉండాలి. తక్కువ చక్కెర ఆహార ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం మంచిది.