తస్మాత్ జాగ్రత్త : Google Pay యూజర్లకు సెక్యూరిటీ టిప్స్..!

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 10:52 AM IST
తస్మాత్ జాగ్రత్త : Google Pay యూజర్లకు సెక్యూరిటీ టిప్స్..!

Updated On : December 25, 2019 / 10:52 AM IST

గూగుల్ పే వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ బ్యాంకు అకౌంట్లలో నగదు భద్రమేనా? ఓసారి చెక్ చేసుకోండి. సైబర్ మోసగాళ్ల నిఘా మీ అకౌంట్లపై ఉందని మరవద్దు. ఏ క్షణంలోనైనా మీ కన్నుగప్పి నగదు మాయం చేసేస్తారు. డిజిటల్ పేమెంట్స్ సంస్థల్లో గూగుల్ పేతో పాటు పేటీఎం సహా ఇతర పేమెంట్స్ ప్లాట్ ఫాంలన్నీ మొబైల్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.

కానీ, సైబర్ నేరగాళ్లు ప్రత్యేకించి ఇండియాలోని ఆన్ లైన్ వినియోగదారులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారని గూగుల్ హెచ్చరిస్తోంది. గూగుల్ పే యూజర్ల సేఫ్టీ కోసం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం కొన్ని సెక్యూరిటీ టిప్స్ అందిస్తోంది. సైబర్ నేరగాళ్ల బారి నుంచి అకౌంట్లతో పాటు నగదును ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో పలు సూచనలు చేస్తోంది.

ప్రత్యేకించి.. గూగుల్ పే యూజర్లను వారి UPI Pinను సీక్రెట్ గా ఉంచుకోవాలని హెచ్చరిస్తోంది. గూగుల్ పే రెండు భద్రతపరమైన విధానాలతో వస్తోంది. అందులో ఒకటి పేమెంట్ అప్లికేషన్ Unlock చేయడం, రెండోది UPI Pin ద్వారా పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. గూగుల్ నిర్వహించే కొత్త యాడ్ క్యాంపెయిన్‌లో భాగంగా యూజర్లను ATM పిన్ మాదిరిగానే UPI PIN కూడా సీక్రెట్‌గా ఉంచుకోవాల్సిందిగా సూచిస్తోంది.

అనుమానాస్పద అప్లికేషన్స్ మొబైళ్లలో డౌన్ లోడ్ చేసుకోవద్దని హెచ్చరిస్తోంది. ఏదైనా అనుమానాస్పదంగా గుర్తించినా వెంటనే కస్టమర్ కేర్ ను సంప్రదించాలని సూచిస్తోంది. మీకు ఏమైనా అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గూగుల్ పలు సూచనలు చేస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం..

* గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తే.. వెంటనే అప్రమత్తం అవ్వండి. బ్యాంకు నుంచి కాల్ చేశామని, రిటైలర్, ఇన్సూరెన్స్ అంటూ చెబితే జాగ్రత్త పడండి. నిజంగా వారెవరో గుర్తించే ప్రయత్నం చేయండి. అనుమానం వస్తే వెంటనే కాల్ కట్ చేయండి.

* కాల్ సంభాషణలో.. మీ వ్యక్తిగత వివరాలు ప్రభుత్వ ఐడీకార్డు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత ఆర్థిక వివరాలు, PIN, బ్యాంకు అకౌంట్ నెంబర్, UPI IDలను అడిగితే ఇవ్వకండి.

మెసేజ్, కాల్ వస్తే ఏం చేయకూడదంటే? :
* ఇన్ స్టంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించొద్దు.
* ఫోన్ కు పంపిన SMS/ఈమెయిల్ Link చేయొద్దు.
* ఏదైనా యాప్.. డౌన్‌లోడ్ లేదా ఇన్‌స్టాల్ చేయమంటే చేయొద్దు.
* ఏదైనా సాఫ్ట్ వేర్ లేదా వెబ్ లింకుతో మీ ల్యాప్ టాప్ లేదా ఫోన్ స్ర్కీన్ షేర్ చేయొద్దు.
* మీ ప్రభుత్వ ఐడీ, PIN, UPI ID లేదా ఏదైనా బ్యాంకు వివరాలను ఫోన్లో చెప్పొద్దు.
* ఏదైనా ఆన్ లైన్ Form పూర్తి చేయమన్నా, అది చట్టబద్ధంగానే ఉన్నా తొందరపడొద్దు.
* ఫేక్ వెబ్ పేజీల (బ్యాంకు, యాప్)ను లోగో, డిజైన్ రియల్ ఫార్మాట్లలోనే క్రియేట్ చేస్తుంటారు.

గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే :
* మీ UPI PIN నగదు పంపడానికి మాత్రమే అవసరం.
* మీ అకౌంట్లోకి ఇతరులు నగదు పంపడానికి PIN అక్కర్లేదు.
* ఎవరైనా మీ PIN ఎంటర్ చేయమంటే.. నగదు ఇతరులకు పంపుతున్నట్టే. 
* పరధ్యానంలో రీఛార్జ్, బిల్ పేమెంట్ లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ చేయకూడదు.
* ఫోన్ లైన్ లో ఎవరైనా ఉన్న సమయంలో ఎప్పుడూ ట్రాన్సాక్షన్ చేయొద్దు.
* ట్రాన్సాక్షన్ చేసే సమయంలో జాగ్రత్తగా ఎవరికి నగదు పంపుతున్నామో ఆలోచించాలి.

ఇటీవలే గూగుల్ పే.. తమ యూజర్ల ట్రాన్సాక్షన్ల కోసం SMS నోటిఫికేషన్ ప్రవేశపెట్టింది. మీకు ఏదైనా అపరిచితుల నుంచి నగదు రిక్వెస్ట్ వస్తే.. వెంటనే మీకో నోటిఫికేషన్ వస్తుంది. యూజర్ ఫోన్ కాంటాక్టు లిస్టులో లేకుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. గూగుల్ పే… మిషన్ లెర్నింగ్ ఆధారిత స్కాన్ ప్రివెన్షన్ మోడల్స్ వినియోగిస్తోంది. వీటి ద్వారా సులభంగా అది స్కామ్ లేదా అపరిచితులా వెంటనే SMS రూపంలో యూజర్లను అప్రమత్తం చేస్తుంది.

ఇటీవలే గూగుల్ పే.. తమ యూజర్ల ట్రాన్సాక్షన్ల కోసం SMS నోటిఫికేషన్ ప్రవేశపెట్టింది. మీకు ఏదైనా అపరిచితుల నుంచి నగదు రిక్వెస్ట్ వస్తే.. వెంటనే మీకో నోటిఫికేషన్ వస్తుంది. యూజర్ ఫోన్ కాంటాక్టు లిస్టులో లేకుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది. గూగుల్ పే… మిషన్ లెర్నింగ్ ఆధారిత స్కాన్ ప్రివెన్షన్ మోడల్స్ వినియోగిస్తోంది. వీటి ద్వారా సులభంగా అది స్కామ్ లేదా అపరిచితులా వెంటనే SMS రూపంలో యూజర్లను అప్రమత్తం చేస్తుంది.

Paytm పేరుతో e-KYC మోసాలు :
సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు కేవలం గూగుల్ పే ప్లాట్ ఫాంపై మాత్రమే కాదు.. ఇతర డిజిటల్ ప్లాట్ ఫాంలపై కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇండియాలో అత్యంత ప్రసిద్ధిగాంచిన డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాం Paytmను కూడా సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. గతనెలలో e-KYC వెరిఫికేషన్ పేరుతో ఎంతోమంది యూజర్లు సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయారు. ఈ విషయంలో స్పందించిన పేటీఎం తమ యూజర్లకు వరుస నోటిఫికేషన్లలో ప్రకటనలు జారీ చేసింది.

ఏదైనా అప్లికేషన్ డౌన్ లోడ్ లేదా కేవైసీ పూర్తి చేయాలంటూ మలాసియస్ మెసేజ్ వంటి వాటిని కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ యూజర్లకు పంపదని స్పష్టం చేసింది. అధికారిక KYC కేంద్రాల్లో మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటుందని పేటీఎం తమ అడ్వైజరీలో పేర్కొంది. ‘ మీ Patm అకౌంట్ బ్లాక్ అవుతుందని లేదా KYC పూర్తి చేయాలంటూ ఏదైనా SMS వస్తే అలాంటి కాల్స్ నమ్మవద్దు’ అని పేటీఎం విజయ్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Request Money పేరుతో మోసాలు :
మరోవైపు PhonePe కూడా తమ యూజర్లకు అడ్వైజరీ రిలీజ్ చేసింది. Requet money మోసాలు పెరిగిపోతున్నాయని, ఇలాంటి మోసాల విషయంలో యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటీవల Quikr, OLX వంటి ఇతర సైట్లలో ఏదైనా ప్రొడక్టు క్రయవిక్రయాలకు సంబంధించి పోస్టులు పెట్టేవారిపై సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. మీ ప్రొడక్టు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టుగా మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు.

మీ PhonePe యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తామని నమ్మిస్తారు. మీ వ్యక్తిగత బ్యాంకు వివరాలను అడిగి తీసుకుంటారు. తాము ఆర్మీలో లేదా పోలీసు శాఖలో, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నట్టుగా తమ క్రెడిన్షియల్స్ క్రియేట్ చేసుకుంటారు. ప్రభుత్వ అధికారులుగా చెప్పుకుని మీకు తెలియకుండానే మీ అకౌంట్లో నగదు కొట్టేస్తారు జాగ్రత్త ’ అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్టులో తెలిపింది.