హెల్త్ టిప్: ఎండల్లో చల్లబరిచే కీరాదోస

ఈ ఎండల నుంచి బయటపడాలంటే చల్లచల్లని పానీయాలు మాత్రమే కాదు చల్లదనాన్నిచ్చే ఆహారం తీసుకోవడమూ ఇంపార్టెంటే. ఈ సీజన్ లో కనిపించే కూరగాయల్లో చాలా వరకు చల్లదనాన్నిచ్చేవే ఉంటాయి. అలా ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహార పదార్థాల్లో కీర దోస కూడా ఒకటి. అది అందించే ఆరోగ్యమెంతో తెలుసా..?
* ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ గా లభించే కూరగాయలు, పండ్లు తీసుకోవాలని చెప్తారు నిపుణులు. ఈ సీజన్ లో బాగా దొరికే ఆహారంలో కీరదోస కూడా ఒకటి. కీరదోసకాయలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో అయితే కీరదోసను నిత్యం తీసుకోవాలి.
* కీరదోసకాయలను తినడం వల్ల శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది.
* శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, డయాబెటిస్ ఉన్నవారు కీరదోసను తింటే ఆ సమస్యలు సులువుగా తగ్గితాయి. అధిక బరువు ఉన్న వారు నిత్యం కీరదోస తింటే బరువు తగ్గుతారని సైంటిస్టులు చేపుతున్నారు.
* ఎండకు వెళ్లి వచ్చే కీరదోసను అడ్డంగా చక్రాల మాదిరిగా కట్ చేసి కళ్లకు 20 నిమిషాల పాటు ఉంచుకుంటే కళ్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవచ్చు.
* చర్మానికి అవసరమైన Vitamin – C లభిస్తుంది. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి మనకు రక్షణ కలుగుతుంది.
* క్యాన్సర్‌కు అడ్డుకట్ట వేసే గుణాలు కీరదోసలో పుష్కలంగా ఉన్నాయి. రోజూ రాత్రి పడుకునే ముందు కొన్ని కీరదోస ముక్కలు తినడంవల్ల తలనొప్పి ఉండదు.