Yellow Teeth : పసుపు రంగులో దంతాలు.. తెల్లగా మార్చేందుకు ఇంటి నివారణ చిట్కాలు !

క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయ, తోపాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి.

Yellow Teeth : పసుపు రంగులో దంతాలు.. తెల్లగా మార్చేందుకు ఇంటి నివారణ చిట్కాలు !

Home Remedies

Yellow Teeth : మనం తినే ఆహారాలు, త్రాగే పానీయాలు, వయస్సు మన దంతాల్లో సమస్యలకు కారణమవుతాయి. అలాగే దంతాల రంగు మారడానికి దారితీస్తాయి. వివిధ కారణాల వల్ల చాలా మందిలో దంతాలు పసుపు రంగులోకి మారతాయి. అయితే చాలా మందిలో తమ దంతాలు తెల్లటి ముత్యాల్లా మెరిసి పోవాలని కోరుకుంటారు. పసుపు రంగులో ఉండే దంతాలతో నలుగురిలో నవ్వే సమయంలో కొంత ఇబ్బందిగా ఫీలవుతుంటారు.

READ ALSO : CLOVES : దంతాలు, చిగుళ్ల సమస్యతోపాటు, చక్కెర స్ధాయిలను తగ్గించే లవంగాలు!

దంతాలు రంగు మారటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణమైనది నోటి పరిశుభ్రత, టీ,కాఫీ, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు, ధూమపానం వంటి అలవాట్లు ,కొన్ని మందులు దంతాలను పసుపురంగులోకి మారటానికి కారణమౌతాయి. పసుపు రంగులో ఉన్న దంతాలను తెల్లగా మార్చేందుకు నిపుణులు కొన్ని గృహ చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసకునే ప్రయత్నం చేద్దాం. వాటి ద్వారా దంతాలపై పసుపు రంగును పొగొట్టుకునే ప్రయత్నం చేద్దాం..

ఇంట్లోనే పళ్ళు తెల్లగా పొందే మార్గాలు ;

1. రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవటం ;

ఉదయం ,పడుకునే ముందు ఇలా రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం వల్ల దంతాలపై పసుపు మచ్చలను పోగొట్టుకోవచ్చు. దంతాలు శుభ్రపడటంతోపాటు మంచి చిరునవ్వును సొంతం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే మరకలు తొలగిపోతాయి. గారపట్టటం నిరోధించవచ్చు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే దంతవైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు , సలహాలు తీసుకోవటం మంచిది.

READ ALSO : Bad Breath : నోటి దుర్వాసనకు విటమిన్ డి లోపం ఒక కారణమా?

2. పీచు కలిగిన ఆహారాన్ని నమిలటం ;

క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయ, తోపాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి. ఈ ఆహారాలను నమలడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన లాలాజల ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. నోటిలోని ఆమ్లాలను తటస్థీకరించడంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. నోటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేందుకు పీచు పదార్దాలు దోహదం చేస్తాయి.

READ ALSO : Brushing Your Teeth : రాత్రిపూట పళ్ళు తోముకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు కలుగుతుందా ?

3. ఆహారంలో పండ్లను చేర్చటం ;

పైనాపిల్స్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీల వంటి పండ్లలో ఎంజైమ్‌లు, తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి, ఇవి మరకలను తొలగించి దంతాలను తెల్లగా మారేలా చేస్తాయి. నోటి ఆరోగ్యం కోసం మీ దంతవైద్యునితో సంప్రదించి తగిన ఆహార మార్పులు చేసుకోవాలి.

పైనాపిల్స్: పైనాపిల్స్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి దంతాలు తెల్లబడటంలో సహాయపడుతుంది. బ్రోమెలైన్ దంతాలపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.

బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పపైన్ దంతాలపై పసుపు మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. దంతాల తెల్లబడటానికి తోడ్పడుతుంది.

స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలు మాలిక్ యాసిడ్‌ను కలిగి ఉంటాయి. మాలిక్ యాసిడ్ దంతాలపైన పసుపు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు తెల్లబడటానికి దోహదం చేస్తుంది.

READ ALSO : Secret to White Teeth : నిమ్మ తొక్క తో మీ దంతాలను తెల్లగామారేలా చేయటం వెనుక రహస్యం తెలుసా ?

4. ఆయిల్ పుల్లింగ్ ;

బ్యాక్టీరియాతోపాటు దంతాలపై మరకలను తొలగించడానికి, కొబ్బరి లేదా నువ్వుల నూనెను 15-20 నిమిషాలు పుక్కిలించాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రపరచడం ద్వారా దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది. నోటి ఆరోగ్యం కోసం అవసరం అనుకుంటే దంతవైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు ,సలహాలు పొందాలి.

READ ALSO : Immunity Boosting : రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్!

5. చార్‌కోల్ ఉత్పత్తులు ;

యాక్టివేటెడ్ చార్‌కోల్ ( బొగ్గు ) కలిగిన దంత ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల మరకలను తొలగించుకోవచ్చు. బొగ్గు యొక్క శోషక లక్షణాలు దంతాలను ప్రకాశవంతంగా మార్చటంతోపాటు, దంతాలపైన మరకలను తొలగించడంలో సహాయపడతాయి.

చివరగా దంతాలు తెల్లబడటం కోసం సహజ పద్ధతులే లాభదాయకంగా ఉంటాయి. ఇంటి నివారణలను ఉపయోగించడం వల్ల కొన్ని సందర్భాల్లో దంతాల సున్నితత్వం దెబ్బతింటుంది. అయితే ఈ చిట్కాలను అనుసరించే ముందు నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.