ఏ వ్యాక్సిన్ సక్సెస్ అయినా ముందు.. మందు మనకే..

  • Published By: sreehari ,Published On : August 18, 2020 / 09:13 PM IST
ఏ వ్యాక్సిన్ సక్సెస్ అయినా ముందు.. మందు మనకే..

Updated On : August 18, 2020 / 9:28 PM IST

చాలా దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పైనే అందరి చూపు ఉంది. ఎందుకంటే మొదటినుంచి పద్దతి ప్రకారం ప్రయోగాలు చేస్తోంది. దాని ఫలితాలను కూడా ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. ఫస్ట్ స్టేజ్ లో ఏకంగా 1000 మందిపై పరీక్షలుగా జరపగా మంచి ఫలితాలు కనిపించాయి. 18 నుంచి 55 ఏళ్ల వయసు లోపు వారిపై ఆస్ట్రాజెనెకా టీకా ప్రయోగించగా… వాళ్లలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ప్రపంచమంతా ఆస్ట్రాజెనెకా కోసం ఎదురుచూస్తోంది.

శరీరంలోని కణాల చుట్టూ స్ప్రైక్ ప్రొటీన్లు :
చైనాకు చెందిన కాన్‌సినో బయోలాజిక్స్ అభివృద్ది చేస్తున్న వ్యాక్సిన్‌కు, ఆక్సఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు చాలావరకు దగ్గర పోలికలున్నాయి. జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన వైరస్‌లతో వీటిని డెవలప్ చేశారు. ఈ వైరస్‌లను అడెనోవైరల్ వెక్టార్స్ అని కూడా పిలుస్తారు. శరీరంలోకి వైరస్ ప్రవేశించించగానే అన్ని వ్యవస్థలపై ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుంది.



దీంతో వైరస్‌తో పోరాడేందుకు శరీరంలోని కణాలు వాటి చుట్టూ స్పైక్ ప్రోటీన్లను ఏర్పరుచుకుంటాయి. ఈ టీకాలో చింపాంజీ అడెనోవైరస్ బలహీనంగా, జన్యుపరంగా మార్పు చెందిన రూపంలో ఉంటుంది. దీంతో అది అది మనుషులకు సోకదు. కానీ స్పైక్ ప్రోటీన్ల ఉత్పత్తిలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది.

భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్, క్యాడిలా ప్రయోగాలు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. రెండోదశలో ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు. త్వరలో మూడో దశ కూడా ప్రారంభించనున్నాయి. వీటితో పాటు ఆక్స్ ఫర్డ్ ట్రయల్స్ కూడా తుదిదశలో ఉన్నాయి.



ఈ మూడింట్లో ఏది సక్సెస్ అయినా ముందుగా మందు వచ్చేది మనకే. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కరోనాకు కళ్లెం వేసే ఖచ్చితమైన వ్యాక్సిన్ వస్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ప్రపంచం ఊపిరి పీల్చుకున్నట్టే.

కరోనాను తరిమికొట్టేందుకు యాంటీబాడీస్ ఉత్పత్తి :
ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ రీసెర్చ్ పరిశోధకులు కూడా ఓ వ్యాక్సిన్ తయారు చేశారు. యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేసి కరోనా ను తరిమికొట్టడానికి వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని ఆ దేశ రక్షణశాఖ ప్రకటించింది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్నది మాత్రం ప్రకటించలేదు. వ్యాక్సిన్ ను భారీ స్థాయిలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.

కరోనా వైరస్ గుప్పిట్లో 110కి పైగా దేశాలు
కరోనా కల్లోలంతో బాధిత దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఈ సమయంలో రష్యా వ్యాక్సిన్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ పరీక్షలు సరిగా చేయలేదనే కారణాలతో ఆ వ్యాక్సిన్ తీసుకునేందుకు చాలా దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అమెరికా అయితే ఆ వ్యాక్సిన్ తమకొద్దని బాహటంగానే ప్రకటించింది.



మరోవైపు వ్యాక్సిన్ అంత త్వరగా మార్కెట్ లోకి రాదనే అభిప్రాయాలు ఉన్నాయి. వ్యాక్సిన్ సక్సెస్ అయినా ఉత్పత్తికి మరింత సమయం పట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాలు వైరస్ గుప్పిట్లో చిక్కుకున్నాయి. కరోనా సోకి కోట్లమంది చికిత్స తీసుకుంటున్నారు.

వాళ్లందరికీ డోసులు పంపిణీ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే వాదనలు ఉన్నాయి. మనదేశంలో మూడు కంపెనీలు ప్రయోగాల్లో దూసుకెళ్తున్నాయి. వీటిలో అటు ఇటుగా మూడు సక్సెస్ అయినా ప్రపంచం రిలీఫ్ గా ఫీలవడం ఖాయం. ప్రధాని మోదీ ఆశాభావం చూస్తుంటే త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న అంచనాలు ఉన్నాయి.