ఆధార్ ఉందా? 10 నిమిషాల్లో ఫ్రీగా PAN card పొందొచ్చు! 

  • Published By: sreehari ,Published On : February 22, 2020 / 12:23 AM IST
ఆధార్ ఉందా? 10 నిమిషాల్లో ఫ్రీగా PAN card పొందొచ్చు! 

మీకు ఆధార్ కార్డు ఉందా? పాన్ కార్డు తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు కొత్త పాన్ కార్డు పొందవచ్చు. అది కూడా ఉచితంగా.. అదెలా అనుకుంటున్నారా? ఏమి లేదు.. ఇందుకు మీరు రెండు పేజీల అప్లికేషన్ కూడా నింపాల్సిన పనిలేదు. కేవలం 10 నిమిషాల్లో కొత్త పాన్ కార్డు తీసుకోవచ్చు. పన్నుదారుల కోసం ఇటీవలే ఈ కొత్త సదుపాయాన్ని ఆదాయ పన్ను శాఖ ప్రవేశపెట్టింది. పన్నుదారులు ఎవరైనా తమ ఆధార్ కార్డు ద్వారా ఇన్ స్టంట్ పాన్ కార్డును ఆన్ లైన్ లో పొందే సౌలభ్యాన్ని ఉచితంగా అందిస్తోంది.

ఇన్ స్టంట్ ఈ-పాన్ కార్డు అప్లికేషన్ లో మీరు కేవలం మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తద్వారా మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి e-KYC ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. దీంతో వెంటనే మీకు 10 నిమిషాల్లో ఇన్‌స్టంట్ పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) కార్డు PDF ఫార్మాటులో పొందవచ్చు. పిజికల్ కాపీ మాదిరిగానే e-PAN కార్డును ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. దీన్ని ఫిజికల్ పాన్ కార్డులానే నామినేషన్ చేసుకోవచ్చు. దీనికి మీకు అయ్యే ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే.

ఇన్‌స్టంట్ PAN కార్డు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా? :
* ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్టమెంట్ అధికారిక వెబ్ సైట్ e-filing portal విజిట్ చేయండి.
* Instant PAN through Aadhaa అనే సెక్షన్ కింద Quick Links బటన్ పై Click చేయండి.
* కొత్త పేజీలో Get New PAN అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* ఇక్క మీ ఆధార్ నెంబర్ తో పాటు Captcha కోడ్ ఎంటర్ చేయండి.
* మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
* వచ్చిన OTP ను వ్యాలిడెట్ చేసి అక్కడ ఎక్కడ ఎంటర్ చేయండి.
* ఆధార్ వివరాలను ఎంటర్ చేసి వ్యాలిడెట్ చేయండి.
* ఇక్కడ మీ ఈమెయిల్ ఆప్షన్ కూడా ఉంది.. ఈమెయిల్ ఇవ్వడం ఉత్తమం.
* పాన్ కార్డు అప్లికేషన్ వ్యాలిడెట్ చేసుకోండి.
* e-KYC డేటాతో ఆధార్ నెంబర్ అనుసంధానమైనవుతుంది.
* ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఇన్ స్టంట్ e-PAN కార్డు కేటాయిస్తుంది.
* దీనికి పట్టే సమయం కేవలం 10 నిమిషాలు మాత్రమే
* మీరు PAN కార్డును PDF ఫార్మాట్ లో Download చేసుకోండి
* ఈమెయిల్ యాడ్ చేసి ఉంటే దానికి కూడా పాన్ కార్డు పీడీఎఫ్ వస్తుంది.

గమనిక : ఈ సౌకర్యం కేవలం ఇదివరకే పాన్ కార్డు కేటాయించని వారికి మాత్రమేనని గుర్తించుకోండి. మొబైల్ నెంబర్ అనుసంధానమైన ఆధార్ నెంబర్ ఉండాలి. తేదీ, నెల, సంవత్సరం ఇలా పూర్తిగా పుట్టినతేదీ ఉండాలి. మైనర్లకు ఈ-పాన్ కార్డు సౌకర్యం అందుబాటులో లేదు.