Winter Food : చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో….
ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మరియు లుటిన్ పుష్కలంగా ఉన్నాయి.

Children
Winter Food : చలికాలంలో వ్యాధుల విజృంభణ అధికంగా ఉంటుంది. ఏమాత్రం శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నా వాటి భారిన పడి అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చిన్నారుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు సులభంగా అనారోగ్యాల భారిన పడుతుంటారు. చలికాలంలో పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు లేదా అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. వారు తీసుకునే ఆహారం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏమాత్రం ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నా వారు వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉంటుంది.
ముఖ్యంగా చలికాలంలో పిల్లలకు సి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను అందించాలి. ఉసిరి, నిమ్మకాయ, బత్తాయి వంటివి పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి. సాయంత్రం వేళల్లో జీడిపప్పు, బాదంపప్పు, వాల్ నట్స్ వంటి వాటిని కొద్ది కొద్ది మొత్తాల్లో అందించాలి. చల్లిని వాతవరణానికి వెచ్చదనాన్ని ఇచ్చే సూప్ లను పిల్లలకు ఇవ్వటం మంచిది.
తీపి పదార్ధాలను తినేందుకు చాలా మంది పిల్లలు మారాం చేస్తుంటారు. అలాంటి వారికి బెల్లంతో తయారు చేసిన శనగముద్దలు, పల్లీ చెక్క వంటి వాటిని అందించాలి. ఇలా చేయటం వల్ల పిల్లలు ఇష్టంగా తినటంతోపాటు వారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్ ఉంటుంది, ఇది శీతాకాలంలో రక్తంలో తెల్ల రక్త కణాల స్థాయిని పెంచుతుంది. పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి వారిని రక్షించడంలో తెల్ల రక్త కణాలు చాలా సహాయకారిగా ఉంటాయి.
ఖర్జూరంలో కాల్షియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి విటమిన్లు మరియు మినరల్స్ ఉంటాయి, ఇవి చలి రోజుల్లో పిల్లలను వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటంతోపాటు జీవక్రియను ప్రేరేపిస్తాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్లు గ్రుడ్లను ఇవ్వటం ద్వారా అందించవచ్చు. ఇందులో ఉంటే విటమిన్లు మరియు ఖనిజాలను పిల్లల ఎదుగుదలకు ఉపకరిస్తాయి. చలికాలంలో పిల్లలకు ఆహారంగా గుడ్డు చేర్చటం మంచిది.
నారింజ , దానిమ్మ వంటి పండ్లలో విటమిన్ సి, ఫైబర్,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపకరిస్తాయి. వెల్లుల్లిని చలికాలంలో చిన్నారుల ఆహారంలో భాగం చేయటం మంచిది. ఎందుకంటే వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలను దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
ఆహారంలో పచ్చి కూరగాయలను చేర్చటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ మరియు లుటిన్ పుష్కలంగా ఉన్నాయి. పిల్లల జీర్ణాశయాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు, మలబద్దకాన్ని నివారిస్తాయి. ఉడికించిన చిలగడ దుంపలను అందించటం ద్వారా పిల్లలకు మంచి పోషకాలు అందుతాయి. వీటిల్లో ఫైబర్, విటమిన్ ఎ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
చిలగడదుంపలో ఫైబర్, విటమిన్ ఎ మరియు పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల శీతాకాలంలో పిల్లల ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. కాబట్టి పిల్లలు తమ ఆహారంలో ఉడికించిన చిలగడదుంపలు లేదా చిలగడదుంప పుడ్డింగ్ వంటి వివిధ రకాల వంటకాలను చేర్చుకోవచ్చు.