Protein Diet : అధిక ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదేనా?

ఎక్కువ ప్రోటీన్‌ కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్‌ సైతం ఆకలి పెరిగేందుకు

Protein Diet : అధిక ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదేనా?

Best Food

Updated On : October 1, 2021 / 6:01 PM IST

Protein Diet :  కోవిడ్ నేపధ్యంలో చాలా మంది తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేశారు. వ్యాధుల భారి నుండి రక్షణ పొందటం కోసం ప్రొటీన్ కలిగిన ఆహారాలను తీసుకోవటంపై ఎక్కువ మంది దృష్టిసారించారు. అధిక ప్రొటీన్లు, తక్కువ ఫైబర్‌ తీసుకోవడం వల్ల చాలా మందిలో జీర్ణకోశ సంబంధ సమస్యలకు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో ఈతరహా పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి కారణం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల్లోని వ్యత్యాసాల వల్ల ఈతరహా సమస్యలే తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తిస్తున్నారు.

శరీరం సక్రమంగా తన విధులు నిర్వర్తించడానికి, వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరుకు రోజుకు ఒక వ్యక్తి తన శరీరం బరువులో ఒక కిలోకు 0.66 గ్రాముల ప్రొటీన్‌ అవసరం. అత్యధికంగా అది ఒక్క గ్రాము దాటకూడదు. రోజుకు 15 శాతం కేలరీలు నిచ్చే హై ప్రొటీన్‌ ఆహారం సాధారణ పరిస్థితుల్లో వైద్యులు సూచించరు. అధిక ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకమే కాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడొచ్చని న్యూట్రిషియన్ నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ ప్రోటీన్‌ కారణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి తగినంత ఫైబర్, తగినంత నీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని స్టెరాయిడ్స్, యాంటీ బయాటిక్స్‌ సైతం ఆకలి పెరిగేందుకు కారణమవుతాయి. కోవిడ్‌ చికి త్స తర్వాత అధికంగా ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. తీసుకునే ఆహారంలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్నవి కాకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రోటీన్‌ అధికంగా తీసుకుంటే సరిసమానంగా ఫైబర్ ఆహారం కూడా తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది.

ఔషధాలు ఎక్కువగా వాడే వారిలో సహజంగా ఎసిడిటీ, అజీర్తి తదితర జీర్ణకోశ సంబంధ సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. జీర్ణకోశ సమస్యలు, ఎసిడిటీని ఎదుర్కోవటానికి తాము సాధారణంగా యాంటీయాసిడ్స్‌ సూచిస్తామని వైద్యులు చెబుతున్నారు. అయితే ఖాళీ కడుపుతో లేదా ఆహారం తర్వాత మందులు తీసుకోవాలా అనే విషయంలో రోగులకు స్పష్టత ఉండాలంటున్నారు. ఆకుకూరలు, పండ్లు, సలా డ్స్, మొలకలు, చిక్కుళ్లు వంటివి అధికమైన పీచు పదార్ధాలను తినాలని ఉంటాయి. అలాగే తృణ/చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, బీన్స్, పండ్లు, కూరగాయలు ద్వారా కూడా ఫైబర్‌ను పొందవచ్చు. పీచు తగినంత ఉండేలా చూసుకుంటే మలబద్ధకాన్ని నివారించడానికి, హృద్రోగ, డయాబెటిస్, పెద్ద ప్రేగు కేన్సర్లను అడ్డుకుంటుంది. సమతుల ఆహారంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.