Low Calorie : తక్కువ కేలరీలున్నఆహారం తీసుకోవటం ఆరోగ్యానికి మేలా?
చాక్లెట్లు, ఐస్‌క్రీములు, కేకులు, బిస్కెట్లు, ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోవటం మానేయాలి.

Calorie
Low Calorie : బరువు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, బరువు తగ్గడానికి వీలుగా తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలపై ఏమాత్రం అవగాహన లేకపోవటంతో ఏవిపడితే అవి తినేస్తూ ఉన్న బరువుకంటే అధికమై ప్రమాదంలో పడుతుంటారు.
తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకోవటం వల్ల ఒక్క బరువు విషయమే కాకుండా ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా రక్తపోటు సమస్య ఉన్నవారికి తక్కువ కేలరీలు ఉన్న ఆహారం రక్తపోటును నియంత్రించటం సహాయపడుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి తక్కవ కేలరీల ఉన్న పండ్లు కూరగాయాలు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
అంతేకాదు డయాబెటిస్ తో బాధపడేవారు తక్కవ కేలరీలున్న ఆహారం తీసుకోవటం వల్ల రక్తంలో చక్కెర ను నియంత్రించే ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగు పరిచి ప్యాంక్రియాస్ లో కొవ్వు పెరగటాన్ని నిరోధించేందుకు సహాయపడుతుంది. అయితే రోజుకు 800 కేలరీల కన్నా తక్కువ తీసుకోవటం మాత్రం ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. మగవాళ్ళకు రోజుకు 2000 కేలరీలు అవసరమవుతాయి. అదే చిన్నారులు, మహిళలు, వృద్ధులకు రోజుకు 1600 కేలరీలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చాక్లెట్లు, ఐస్‌క్రీములు, కేకులు, బిస్కెట్లు, ఆలూ చిప్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటిలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని తీసుకోవటం మానేయాలి. వీటిని తినకపోవటం వల్ల కేలరీలు తగ్గుతాయి. నూనె పదార్థాలతో తయారైన వాటిని తినటం మానేయాలి. అలాంటి వాటిని తినటం వల్ల కొవ్వు పేరుకుపోయి, కేలరీలు పెరిగిపోయి బరువు అధికమయ్యే అవకాశం ఉంటుంది.
ఆపిల్ ఆహారంగా తీసుకుంటే ప్రతి 100 గ్రాములకు 52 కిలోకెలరీలు శరీరానికి లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్‌సి ఉంటాయి. అధిక మోతాదులో ఉండే ఫైబర్,.. బరువు తగ్గడంలోనూ ఉపకరిస్తుంది. బ్లూబెర్రీ, స్టాబెర్రీ, రాస్‌బెర్రీలను అరకప్పు తీసుకున్నా అందేది 82 కిలోకెలరీలే. వీటిలోని యాంటీ ఆక్సీడెంట్లు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
పుచ్చకాయ రక్తపోటుకు వ్యతిరేకంగా పని చేయడంతో పాటు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. గింజలు రక్తహీనతను తగ్గించి, ఇమ్యూనిటీనీ పెంచుతాయి. ఎ, బికి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండే దీన్నుంచి అందేది 30 కిలోకెలరీలు మాత్రమే. టొమాటో లో ఉండే విటమిన్ ఎ కళ్లకు మంచిది. కడుపు నిండినట్లుగా అనిపించి త్వరగా ఆకలి వేయదు. ప్రతి 100 గ్రాములకు 41 కిలోకెలరీలు అందుతాయి. కీరదోస ఎక్కువ మొత్తంలో నీరుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవటం వల్ల శరీరానికి 15 కెలరీలు అందుతాయి.