Kiwi Fruit : కివీ పండు… పోషకాలు మెండు

అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ, అలాగే సోడియం లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. గుండెకు ఈ పండు వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

Kiwi Fruit : కివీ పండు… పోషకాలు మెండు

Kiwi Fruit

Updated On : February 7, 2022 / 5:30 PM IST

Kiwi Fruit : సపోటని పోలి ఉండే కివీ పండులో పోషకాలు దండిగా ఉంటాయి. ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు తో ఉండేదీనిని వండర్ ఫ్రూట్ గా పిలుస్తారు. కివి పండులో కొవ్వు, సోడియం, పొటాషియం, ప్రోటీన్ ,కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. విటమిన్ A,క్యాల్షియం , విటమిన్ సి, ఐరన్, విటమిన్ B6, మెగ్నిషియంలు కివి పండులో లభిస్తాయి.

రోజుకొక కివీ పండు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇది శ్వాస సంబంధిత ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనీసం వారానికి ఒకసారి చిన్న పిల్లలకు దీనిని తినిపించటం వల్ల దగ్గు జలుబు సమస్యలు దూరమౌతాయి. గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ, అలాగే సోడియం లెవెల్స్ కూడా తక్కువగానే ఉంటాయి. గుండెకు ఈ పండు వల్ల ప్రయోజనం చేకూరుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది. కాలేయ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ఈ పండును తీసుకోవటం వల్ల ప్రశాంతత కలుగుతుంది.

కివీలో ఉండే ఫోలిక్ యాసిడ్స్ గర్భస్థ శిశువులో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లు అందేలా చేస్తుంది. క్యాన్సర్‌కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్ధం కివీలో ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు. గ్లైసెమిక్ ఇండెక్స్ కివి లోతక్కువ స్థాయిలో ఉండడం వలన,ఇది రక్తం లోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. షుగర్ తో బాధపడుతున్న వారు సైతం ఈ పండును తీసుకోవచ్చు.