Vitiligo : మానసికంగా కుంగదీసే బొల్లిమచ్చల వ్యాధి
బొల్లి మచ్చల వ్యాధి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు,

Vitiligo
Vitiligo : మనిషికి ఒక రూపాన్ని ఇచ్చేది చర్మం. శరీరంలోని భాగాలన్నింటికి రక్షణ కవచంలా ఇది కప్పబడి ఉంటుంది. చర్మంలో ముఖ్యంగా మూడు పొరలు ఉంటాయి. ఎపిడెర్మిస్, డెర్మిస్, హైపోడెర్మిస్ ఇలా మూడుగా పొరలు ఉంటాయి. శరీరంలో కలిగే రసాయన మార్పులు, జీవనశైలి, మానసిక వత్తిడుల కారణంగా కణజాలంపై మెలనోసైట్స్ నశిస్తాయి. దీని వల్ల చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. వీటినే బొల్లి మచ్చలు అని కూడా పిలుస్తారు.
ఈ బొల్లి మచ్చలు ప్రారంభంలో ఒక చిన్న ప్రాంతంలో మచ్చలా కనిపించినా అది క్రమేపి శరీరం మొత్తం విస్తరిస్తుంది. దీంతో శరీరంపైన ఉన్న చర్మం మొత్తం తెల్లగా కనిపిస్తుంది. శరీరానికి దీని వల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ చూసేవారికి ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో ఎదుటు వారు ఏమనుకుంటారోనని చాలా మంది మానసికంగా కుంగిపోతుంటారు. సమాజంలో తాము సాధరణ రీతిలో గడపలేమన్న నైరాస్యంలో ఇంటికే చాలా మంది పరిమితమౌతుంటారు.
బొల్లి మచ్చల వ్యాధి రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో జన్యుపరమైన కారణాలు, మానసిక ఒత్తిడి, ఎండలో తిరగడం వల్ల కలిగే అలర్జీ, జీవనశైలిలోమార్పులు, అతిగా కాఫీ, టీ తాగే అలవాటు ఉండటం, వాడిన నూనె మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం, మసాలాలు విరివిగా వాడటం వంటి కారణాల వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తాగే నీటిలో రసాయనాలు, ఆహార లోపం, విటమిన్లలోపం, సౌందర్యసాధనాలు విరివిగా వాడటం వంటివి కూడా కారణాల వల్ల కూడా ఈ మచ్చల వ్యాధి వచ్చే అకాశం ఉంటుంది.
ఈ తెల్లమచ్చలు చాలా మందిలో ముందుగా ముఖం, పెదవుల మీద, కనురెప్పల వద్ద మొదలవుతాయి. క్రమేపి పాదాలు, అరచేతులు, వేళ్లకు వ్యాపిస్తుంది. చర్మం తెల్లగా మారిన ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కనిపిస్తాయి. అకస్మాత్తుగా శరీరమంతా పాకుతాయి. జీవనవిధానంలో మార్పుల వల్ల రక్తంలో టాక్సిన్స్ ఏర్పడుతుంటాయి. దీనివల్ల మానసిక ఒత్తిడి, తీవ్రమైన శారీరక శ్రమ వల్ల రక్తంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుని ల్యూకోడెర్మా, సొరియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి. బొల్లి మచ్చలకు కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సమస్యను గుర్తించన వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిది. అలాగే ఆయుర్వేదంలో బొల్లి చికిత్సకు మంచి ఔషదాలు ఉన్నట్లు తెలుస్తుంది.